రాష్ట్రంలో వైసీపీ నాయకుల ఆగడాలకు, దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుంది. నిన్నటికి నిన్న ఓ మహిళా నేత టోల్ గేట్ వద్ద ఆపినందుకు సిబ్బందిపై చేయి చేసుకున్నారు. నెల్లూరు మంత్రివర్యులేమో మీడియా సమావేశం పెట్టి మరీ వినలేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కేవలం నేతలే అనుకుంటే వారి బంధువులు సైతం అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు దిగుతున్నారు. తాజాగా వైసీపీ నేతలు, తెదేపా నేతలు వస్తున్న కార్లపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
తీవ్ర గాయాలు
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కలిసి బి కొట్టకోట మండలంలో సమావేశానికి వెళ్తుండగా కురబలకోట మండలం అంగల్లు దగ్గర దాదాపు 200 మంది వైసీపీ నాయకులు రాళ్లతో దాడికి తెగబడి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో చిత్తూరు జిల్లా మాజీ అధికార ప్రతినిధి రాటకొండ మధుబాబు గారి తలకు గాయాలయ్యాయి.
అసలు ప్రజాస్వామ్యం ఉందా
ఇది అనుకోకుండానో లేక ఆవేశంలోనో జరిగిన సంఘటన కాదనేది విస్పష్టం. ఆ దారిలో నేతలు వస్తున్న సంగతి ముందుగా తెలుసుకుని మరీ పక్కా ప్రణాళిక ప్రకారం చేశారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇంత ధైర్యంగా, ఎటువంటి జంకు లేకుండా ఇలాంటి చర్య ఎలా చేయగలుగుతున్నారు? ప్రభుత్వ అండ ఉందనే ధైర్యం, ఏమి చేసినా చెల్లుతుంది అనే గర్వం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇలాంటివి జరిగినపుడు ఏదో నామకావాస్తే అన్నట్లుగా కేసు నమోదు చేసుకుని తర్వాత అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
కోర్టులైతే ఆంధ్రా పోలీసులు ప్రవర్తన మార్చుకోవాలంటూ ఎన్నో సార్లు చెప్పింది. బహుశా ఇలా పోలీసులని కోర్టు ఇన్ని సార్లు తప్పుబట్టడం మన రాష్ట్రంలోనే జరగుతుందని కాదనలేని నిజం. పోలీసులు సవ్యంగా వారి పని చేస్తే ఇలాంటి పనులు చేయడానికి వైసీపీ నేతలు ధైర్యం చేయరు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎవరు ఎన్ని అంటున్నా, కోర్టులు ఎన్ని సార్లు మొట్టికాయలు మా దారి మాదే అన్నట్లుంది అటు ప్రభుత్వం.. ఇటు పోలీసులు.
Must Read ;- దందాలు ఆగకుంటే కష్టం.. వైసీపీ పెద్దల ఆందోళన!