ఏపీలో అధికార పార్టీ వైసీపీ, టీడీపీ కలిసిపోయాయని సోము వీర్రాజు ఆరోపించారు. గుడులపై జరిగిన దాడులు, విగ్రహాల విధ్వంసాలపై ప్రజల దృష్టి మళ్లిండానికి అధికార పక్షం, ప్రతిపక్షం కలిపి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఆలయాలపై జరిగిన దాడుల గురించి అందరి దృష్టి మరల్చడానికి.. విశాఖ ఉక్కు అంశాన్ని తెరపైకి తీసువచ్చారిని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని రెచ్చగొట్లే ప్రయత్నం చేస్తున్నారని వీర్రాజు ప్రభుత్వం, ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
ప్రకటన లేదు.. ఏం లేదు..
విశాఖ ఉక్కు కర్మాగారం గురించి కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదని తెలిపారు. కనీసం ఏదైనా నోటిఫికేషన్ విడుదలైందా అంటే.. అదీ లేదు.. మరి ఎందుకు ఉద్యమం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. కేవలం దేవాలయాలపై దాడుల అంశాన్ని కనుమరుగయ్యేలా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ విశాఖ ఉక్కు అంశానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆలయాలపై జరిగిన దాడుల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
మతమార్పిడిలపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు..
ఒక్క ట్వీట్‌ను ఆధారంగా చేసుకుని విశాఖ ఉక్కు వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని జీవిఎల్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిళ్లను ప్రశ్నించకూడదనే.. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం లేవనెత్తారు. అసలు మతమార్పిళ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రామతీర్ధం నిందితులు ఏమయ్యారు? కేసు ఎంతవరకు వచ్చింది? ఇలా ఎన్నో అంశాలను సమాధానాలు చెప్పలేక.. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ జీవిఆర్ ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడారు.
Must Read ;- ఉద్యమాన్ని తాకట్టు పెట్టి రాజకీయ లబ్ధా.. విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళన











