పంచాయతీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని విపక్ష టీడీపీ ఫిర్యాదులు చేస్తున్నా వాటికి అడ్డుకట్ట పడటం లేదు. అధికార పార్టీ నేతలు ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభపెడుతూనే న్నారు. తాజాగా తిరుమల దేవుడి ప్రసాదాన్ని పంపీణీ చేస్తూ ఓట్లు అడుగుతున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీలో ఓ అభ్యర్థి తిరుమల శ్రీవారి లడ్డూలు పంపీణీ చేస్తూ తనకు ఓటేయాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓ వైపు తిరుమలలో భక్తులకు లడ్డూలు దొరకటం గగనమవుతున్న తరుణంలో ఇక్కడ పంపిణీకి ఎలా సమకూరాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా పంపీణీ చేస్తున్నా సంబంధిత ఎన్నికల నిర్వహణ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేగాక రేషన్ బియ్యం సరఫరా చేసే పౌర సరఫరాల శాఖ వాహనంలోనే ఇవి సరఫరా చేస్తుండటం గమనార్హం. ఈ విషయమై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ వాహనాల విషయంలో విచారించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Must Read ;- బెదిరింపు బాధితులకు నామినేషన్ వేసే అవకాశం.. ఎన్నికల సంఘం ఆదేశాలు











