నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. ఆతర్వాత వచ్చిన రూలర్ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో బాలయ్య మార్కెట్ బాగా పడిపోయింది. ఇక ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన వినయ విధేయ రామ కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో బోయపాటి సినిమా అంటే ఇంతకు ముందు ఉన్నంత ఊపు లేదు.
ఇలాంటి టైమ్ లో ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య, బోయపాటి కలిసి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి పెద్దగా బిజినెస్ ఏమీ జరగదు అనుకుంటే.. భారీ స్ధాయిలో బిజినెస్ జరగడం ఒక విధంగా షాకే అని చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కలిపి ఈ చిత్రం థియేటరికల్ రైట్స్ 55 కోట్లకు అమ్ముడైనట్టు టాక్ వినిపిస్తోంది. ఏపీలో అయితే.. దాదాపు 35 కోట్లు పలికిందట. శాటిలైట్, ఓటీటీ, హిందీ డబ్బింగ్.. ఇవన్నీ కలుపుకుంటే మరో 16 కోట్ల వరకూ రావొచ్చు.
అంటే.. దాదాపు 70 కోట్లన్నమాట. ఈ సినిమా బడ్జెట్ కూడా 70 కోట్లు. బాలయ్య సినిమాకి బడ్జెట్ 70 కోట్లు అని తెలిసినప్పుడు బాలయ్య మూవీకి అంత బడ్జెట్టా అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ సినిమాకి అదే స్ధాయిలో బిజినెస్ జరగడం చూసి అంతా షాక్ అవుతున్నారు. బాలయ్య, బోయపాటి కలిసి సింహా, లెజెండ్ చిత్రాలు చేయడం.. ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడం తెలిసిందే. ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ఇక రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- ఎన్టీఆర్, బాలయ్య.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడయ్యా?