నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ శ్యామ్ సింగ రాయ్. ఇందులో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపు డిసెంబర్ 24న మెగా హీరో వరుణ్ తేజ్ గని సినిమా కూడా రిలీజ్ కానుంది.
ఈ రెండు సినిమాల్లో ఏదొక సినిమా వాయిదా పడుతుందేమో అనుకున్నారు కానీ.. వాయిదా పడేలా కనిపించడం లేదు. దీంతో డిసెంబర్ 24న నాని శ్యామ్ సింగ రాయ్, వరుణ్ తేజ్ గని బాక్సాఫీస్ దగ్గర పోటీపడడం ఖాయం అనిపిస్తుంది. ఇటీవల గని టీజర్ రిలీజైంది. ఆ టీజర్ లో వరుణ్ తేజ్ హార్డ్ వర్క్ కనిపించింది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ రోజు నాని శ్యామ్ సింగ రాయ్ టీజర్ రిలీజైంది. ఇక టీజర్ విషయానికి వస్తే.. స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్.. అంటూ శ్యామ్సింగారాయ్ పాత్రలో నాని చెప్పే డైలాగ్లు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేలా ఉన్నాయి.
ఫస్ట్ షాట్ నుంచి ఈ టీజర్ లో కనిపించిన ప్రతీ విజువల్ చాలా గ్రాండ్ గా అదిరింది అనేలా కనిపిస్తుంది. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ ఫెక్ట్ అనేట్టుగా ఉంది. ఈ టీజర్ సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలను పెంచేసింది. ఈమధ్య సరైన సక్సస్ లేక కెరీర్ లో బాగా వెనకబడిన నాని ఈ సినిమాతో ఆశించిన విజయం సాధించడం ఖాయం అనిపిస్తుంది. మరి.. డిసెంబర్ 24న బాక్సాఫీస్ దగ్గర పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.
Must Read ;- ఎట్టకేలకు రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ వచ్చింది