ఫ్యాన్ పార్టీకి పవర్ కట్ చేసిన తమ్ముళ్లు!
ఏపీ వ్యాప్తంగా మిగిలి ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ .. అధికార పార్టీపై పై చేయిగా నిలిచింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు – పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, కుప్పం, అనంతపురం తదితర జిల్లాలో టీడీపీ తన సత్తాచాటుకుంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్వగ్రామాల్లోనే టీడీపీ విజయకేతనం ఎగవేయడం విశేషం. నిన్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘననీయమైన ఓటు బ్యాంకును సాధించి తన పట్టు నిలుపుకోగా .. పంక పార్టీ అంతటా ఢీలా పడింది. జగన్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఈ ఫలితాలు చెంపపెట్టైతే, నూతన ఉత్సహాన్ని, మరింత బాధ్యతలను గుర్తు చేసేలా ప్రజా తీర్పు ఉందని ‘తెలుగు దేశం’పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Must Read ;- దర్శి నగర పంచాయితీలో ’టీడీపీ‘ ఘన విజయం!











