అక్కినేని నాగచైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ విభిన్న ప్రేమకథా చిత్రానికి అన్నివర్గాల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన భారీ క్రేజీ మూవీ ఇది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ వస్తుండడం విశేషం. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురు చూసింది. అంచనాలకు మించిన స్పందన రావడం విశేషం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో సాయిపల్లవి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.. ఈ సినిమాలో నేను నాగచైతన్యను ముద్దు పెట్టుకునట్టు ఓ సీన్ ఉంటుందని, కానీ అది నిజం కాదని.. కెమెరామెన్ ఆ సన్నివేశాన్ని నిజం అనిపించేలా కెమెరా యాంగిల్‌ను అలా సెట్ చేశారని అన్నారు. తాను ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించలేదని, ఏదైనా సినిమాకు డేట్స్ ఇచ్చేటప్పుడే ఇలాంటి సీన్లలో నటించనని తాను ముందే దర్శక నిర్మాతలకు క్లారిటీగా చెబుతానని సాయి పల్లవి చెప్పింది.
ముద్దు సీన్‌లో నటించమని దర్శకుడు శేఖర్ కమ్ముల గారు కూడా నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని సాయిపల్లవి చెప్పింది. ఈ సినిమాలోని నాగచైతన్య, సాయిపల్లవి జంట చూడముచ్చటగా ఉంది అంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా ఇంతటి విజయం సాధించడానికి కారణం ఈ జంట నటన అని చెప్పచ్చు. విశేషాదరణ పొందుతోన్న ఓవర్ సీస్ లో ఆల్రెడీ రికార్డు సెట్ చేసింది. మరి.. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్ లో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- తెలుగు చిత్ర పరిశ్రమకు ‘లవ్ స్టోరీ’ ఓ టానిక్











