యువ కథానాయకులలో రామ్ మరింత చురుకుగా .. చలాకీగా కనిపిస్తాడు. లవ్ .. యాక్షన్ .. కామెడీని తనదైన శైలిలో ఆవిష్కరించడం రామ్ ప్రత్యేకత. ఇక డాన్స్ విషయంలోను రామ్ తన జోరు చూపుతుంటాడు. అందువలన యూత్ లో రామ్ కి మంచి ఫాలోయింగ్ వుంది. ‘ఇస్మార్ట్ శంకర్‘ తో మాస్ ఆడియన్స్ నుంచి కూడా ఆయన మంచి మార్కులను రాబట్టాడు. ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో రామ్ ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. అదీ హిందీ యూ ట్యూబ్ ఛానల్ నుంచి కావడం విశేషం.
రామ్ సినిమాల్లో వేగం ఉంటుంది .. కథ నత్త నడక నడవటానికి ఆయన అస్సలు ఒప్పుకోడు. కథలో నాటకీయ పరిణామాలతో కూడిన మలుపులకు ఆయన ప్రాధాన్యతను ఇస్తుంటాడు. అందువలన చకచకా సన్నివేశాలు మారిపోతూ ఉంటాయి. ఈ కారణంగానే రామ్ హిందీ డబ్బింగ్ వెర్షన్ సినిమాలకి మంచి డిమాండ్ ఏర్పడింది. రామ్ యాక్టింగ్ స్టైల్ ఉత్తరాదిన ఆయనకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడేలా చేసింది. ఆ అభిమానమే ఆయనకి కొత్త రికార్డును అందించింది.
ఇంతకుముందు రామ్ చేసిన వాటిలో ఓ అయిదు హిందీ డబ్బింగ్ వెర్షన్ సినిమాలు హిందీ యు ట్యూబ్ ఛానల్ లో 100 మిలియన్ల వ్యూస్ ను రాబట్టాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘జస్ట్ గణేశ్‘ సినిమా కూడా వచ్చి చేరింది. రామ్ హీరోగా 2009లో వచ్చిన ‘జస్ట్ గణేశ్’ .. ఆయన స్పీడ్ ను ఆడియన్స్ కి మరోసారి రుచి చూపించింది. యాక్షన్ తో కూడిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ఆయన కాజల్ జోడీ కట్టాడు. రామ్ చేసిన ఈ సినిమా హిందీ వెర్షన్ ను ఆ తరువాత హిందీ యూ ట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. 100 మిలియన్ వ్యూస్ ను సాధించిన రామ్ 6వ సినిమాగా ఇది నిలిచింది. ఇలా 100 మిలియన్ వ్యూస్ ను రాబట్టిన 6 సినిమాలు కలిగిన తొలి తెలుగు హీరోగా రామ్ పేరుతో కొత్త రికార్డు నమోదు కావడం ఆయన అభిమానులను ఖుషీ చేస్తోంది.
Also Read:-రామ్, ఎన్టీఆర్ ల సయ్యాట ఈనాటిది కాదు!











