‘మద్రాస్ కేఫ్’ బాలీవుడ్ మూవీతో కథానాయికగా ప్రవేశించింది అందాల రాశీ ఖన్నా. ఆ పై ‘మనం’లో క్యామియో అపీరెన్స్ తో మెరిసింది. ‘ఊహల గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయం రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని.. కథానాయికగా మెప్పించింది. టాప్ స్టార్స్ సరసన నటించకపోయినప్పటికీ, గోపీచంద్, రామ్ పోతినేని, నితిన్ , సాయిధరమ్ తేజ లాంటి మీడియమ్ రేంజ్ హీరోలతో నటిస్తూ తన ప్రస్థానం కొనసాగించింది. మధ్యలో కొన్ని సినిమాలతో ఫ్లాప్స్ టేస్ట్ చేసినప్పటికీ .. అవకాశాలు మాత్రం బాగానే అందిపుచ్చుకుంది.
లాస్టియర్ ‘వెంకీమామ, ప్రతిరోజూ పండగే’లాంటి సినిమాలతో వరుస విజయాలు అందుకొని ఫామ్ లోకి వచ్చిన రాశీఖన్నా.. ఈ ఏడాది ‘వరల్డ్ ఫేమస్’ లవర్ తో పరాజయం ఎదుర్కొంది. దాంతో ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఒక్క సినిమాకూడా చేయడం లేదు రాశి . అయితే కోలీవుడ్ లో మాత్రం ‘అరణ్మణై 3, తుగ్లక్ దర్బార్’ లాంటి సినిమాలకి కమిట్ అయి.. అక్కడ తన కెరీర్ ను బిల్డ్ చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే అమ్మడు .. ఇప్పుడు తన శరీర సౌష్టవం పై ఓ రేంజ్ లో శ్రద్ధతీసుకుంటోంది.
ప్రస్తుతం రాశీఖన్నా.. జిమ్ లో తన ఒళ్లును విల్లు లా వంచుతూ.. తన అందాలన్నిటినీ రాశిలా పోసి.. నెటిజెన్స్ ను కవ్విస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోస్ ను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. ఈఫోటోస్ కు నెటిజెన్స్ నుంచి భలేగా స్పందన లభిస్తోంది. అమ్మడి వర్కవుట్స్ ను చూస్తుంటే.. తమిళ చిత్రరంగంలో తిష్టవేసేలా కనిపిస్తోందని గుసగుసలాడకుంటున్నారు నెటిజెన్స్ .
https://twitter.com/RaashiKhanna/status/1318442870659969026











