ప్రభుదేవా.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. ప్రభుదేవా డాన్స్ మాస్టర్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమాతో హీరోగా మారాడు ప్రభుదేవా. ఇక టాలీవుడ్ లో రిలీజ్ అయిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో దర్శకుడిగా మారి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు ప్రభు మాస్టర్.
అయితే తన సినీ జీవితంలో ఒక్క వివాదం కూడా లేని ప్రభు మాస్టర్ వ్యక్తిగత జీవితం వలన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ప్రభుదేవాకు ఇదివరకే పెళ్లయింది. ఆయన భార్య పేరు రామలత. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. కొంతకాలం క్రితం ప్రభుదేవా హీరోయిన్ నయనతారతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. నయనతార, ప్రభుదేవాతో పెళ్లి తర్వాత సినిమాల నుండి తప్పుకుంటానని బహిరంగంగానే తెలిపింది. (AlsoRead;-పెళ్లి విషయంలో నయనతార కండిషన్ ఏంటి?
ప్రభుదేవా కూడా నయనతారను పెళ్లి చేసుకోవడం కోసం తన భార్యకు విడాకులు ఇచ్చాడు. మరి ఏమైందో తెలియదుగాని ఈ జంట బ్రేక్ ప్ చెప్పేసుకున్నారు. ప్రభుదేవా తనను మోసం చేసాడని సన్నిహితుల వద్ద చెప్పుకుంది నయనతార. ప్రభుదేవా మాత్రం ఈ విషయంపై ఎక్కడా నోరు విప్పలేదు. అటు భార్య దూరమై, ఇటు ప్రియురాలు దూరమై ప్రస్తుతం ప్రభుదేవా ఒంటరిగా ఉంటున్నాడు. అయితే తాజాగా ప్రభుదేవా తన బంధువుల అమ్మాయితో ప్రేమలో పడ్డాడని జాతీయ మీడియాలో కధనాలు వినపడుతున్నాయి.
ఆమె కూడా ప్రభుదేవా ఇష్టపడుతుందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి జరగబోతున్నారని సమాచారం. వీరి పెళ్ళికి పెద్దలు కూడా అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ప్రభుదేవా లేదా ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించకపోవడం విశేషం. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే స్వయంగా ప్రభుదేవానే స్పందించే వరకు ఆగాల్సిందే మరి.
AlsoRead;-నయన్ ప్రేమకు పెళ్లితోనే శుభం కార్డా?











