ఏకగ్రీవాలపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై ఫిర్యాదులను ఎస్‌ఈసీ పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగుతోంది. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో జోరుగా ఏకగ్రీవాలు జరిగాయి. పుంగనూరు మండలంలో నూరు శాతం, మాచర్ల నియోజకవర్గంలోని 77 గ్రామాలకు గాను 73 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏకగ్రీవాలైన నియోజకవర్గంగా మాచర్ల ముందంజలో ఉంది. గతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ మాచర్లలోని అన్ని స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది.
పుంగనూరులో..
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో రెండు పంచాయతీలు మినహా అన్నీ ఏకగ్రీవమయ్యాయి. పెద్దిరెడ్డి స్వస్థలం సదుంలో 18 పంచాయతీలు, 172 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. పుంగనూరు మండలంలో 23, చౌడేపల్లి మండలంలో 17 ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏకగ్రీవాలన్నీ బలవంతపు ఏకగ్రీవాలంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
Must Read ;- మరోసారి నోరుజారిన మంత్రి కొడాలి, నోటీసులు జారీ చేసిన నిమ్మగడ్డ..











