స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైసీపీ నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే కృష్ణా జిల్లా పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కోడ్ ఉల్లింఘించి మాట్లాడారంటూ ఎస్‌ఈసీ నోటీసులు జారీ చేసింది. సవాల్ చేస్తూ ఎమ్మెల్యే జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం జోగి రమేష్ నుంచి వివరణ తీసుకోవాలని ఇవాళ ఎస్‌ఈసీని కూడా ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ను ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో ఎన్నికలు పూర్తయ్యే వరకు జోగి రమేష్ మాట్లాడటానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశించింది. ఎస్‌ఈసీని విమర్శించడం కాని, కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని హైకోర్టు హెచ్చరించింది.
సేమ్ టు సేమ్
మంత్రి పెద్దిరెడ్డి కూడా ఎస్‌ఈసీపై అనుచిత వ్యాఖ్యలు చేసి కోర్టు కెక్కారు. ఆ కేసులో ఇచ్చిన తీర్పునే ఇవాళ కూడా హైకోర్టు తీర్పు వెలువరించింది. జోగి రమేష్ కూడా మీడియాతో మాట్లాడవచ్చని, కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ఎలాంటి విమర్శలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కోడ్‌ను తూ చా తప్పకుండా పాటించాలని ధర్మాసనం ఆదేశించింది.
Must Read ;- మరోసారి నోరుజారిన మంత్రి కొడాలి, నోటీసులు జారీ చేసిన నిమ్మగడ్డ..











