పోలీసు శాఖ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో కోర్టు దిక్కరణకు పాల్పడినందుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా హాజరుకావాలంటూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ శాఖ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్‌కు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 25న ఇద్దరు అధికారులు కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఏలూరులో ఎస్.ఐ గా విధులు నిర్వహిస్తున్న రామారావుకు సి.ఐ గా ప్రమోషన్ కల్పించే ప్యానల్‌లో స్థానం కల్పించాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, హోం శాఖ అధికారులు కోర్టు ఉత్తర్వులు పట్టించుకోలేదు. దీనిపై రామారావు కోర్టు దిక్కరణ పిటిషన్ వేశారు. కేసును విచారించిన హైకోర్టు డీజీపీ, హోం శాఖ ప్రధాన కార్యదర్శి, ఏలూరు రేంజ్ డీఐజీకి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు విచారణలో డీజీపీ తరపు న్యాయవాది మాత్రమే హాజరయ్యారు. హోంశాఖ కార్యదర్శి, ఏలూరు డీఐజీ తరపున న్యాయవాదులు ఎవరూ హాజరు కాకపోవడంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. ముగ్గురు అధికారులు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
Must Read ;- జగనన్న పాలనలో హత్యారాజకీయాలు జడలు విప్పుకుంటున్నాయా?