విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర క్యాబినెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటుపరం చేసే ముందు, స్టీల్ ప్లాంటు కోసం భూములు ఇచ్చిన రైతుల హక్కుల కోసం పిటిషనర్, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకున్నారా? లేదో స్పష్టం చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. అయితే పెట్టుబడులు ఉపసంహరణ విషయంలో న్యాయసమీక్ష పరిధి పరిమితంగా ఉంటుందని ధర్మాసనం వెల్లడించింది.
అది మా పరిధి కాదు..
ప్రభుత్వాల ఆర్థిక విధానాలు సరైనవో కాదో తేల్చడం తమ పరిధి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు ప్రభావితమైనప్పుడు మాత్రం ఆర్థికపరమైన నిర్ణయాలు కూడా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని ధర్మాసనం గుర్తు చేసింది. లక్షలాది మంది ఉపాధికి ఇబ్బంది కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది, ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని పిటిషనర్ చెబుతున్నారని వాటిని పరిశీలించాలని కోరింది. ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకున్నారా లేదా అని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తే లాభాలు, లేదంటే మూతే కేంద్రానికి ‘ఉక్క’పోత











