ప్రస్తుతం టాలీవుడ్ లో బోలెడు మలయాళ రీమేక్స్ రూపొందుతున్నాయి. మంచి కథలతో.. బ్రిలియంట్ స్ర్కీన్ ప్లేతో మాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాలు .. తెలుగులో రీమేక్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోస్ తో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా లిస్ట్ లో ఉన్నారు. అంతేకాదు.. ఆ సినిమాల్ని అఫీషియల్ గా రీమేక్ చేస్తున్నట్టు కూడా సినిమా లాంచింగ్ టైమ్ లోనే ప్రకటించారు.
అయితే కొన్ని సినిమాలు మాత్రం అఫీషియల్ గా రీమేక్ అవుతున్నప్పటికీ.. ఆ సినిమాలు ఫలానా మలయాళ సినిమాకు రీమేక్ వెర్షన్ అని మాత్రం ఎక్కడా ప్రకటించడం లేదు. ప్రస్తుతం సుమంత్ హీరోగా నటిస్తోన్న ‘అనగనగా ఒక రౌడీ’ అనే సినిమా, అలాగే.. తేజా సజ్జా , ప్రియా వారియర్ జంటగా నటిస్తోన్న ‘ఇష్క్’ సినిమాలు ఆ లిస్ట్ లో ఉన్నాయి. సుమంత్ అనగనగా ఒక రౌడీ ..బిజు మీనన్ నటించిన సూపర్ హిట్ మలయాళ సినిమా ‘పడయోట్టం’ కు రీమేక్ వెర్షన్. ఈ సినిమా లాంఛింగ్ టైమ్ లో ఇది ఓ మలయాళ సినిమాకి రీమేక్ అని తెలియచేసినప్పటికీ.. అది ఏ సినిమానో మెన్షన్ చేయకపోవడం గమనార్హం.
అలాగే.. తేజా సజ్జా నటిస్తోన్న ‘ఇష్క్’ మూవీ .. మలయాళంలో సూపర్ హిట్టైన ‘ఇష్క్’ సినిమాకి రీమేక్ వెర్షన్. షేన్ నిగమ్, ఆన్ శీతల్ జంటగా నటించారు. యస్.యస్. రాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఇది మలయాళ మూవీకి రీమేక్ వెర్షన్ అని ఎక్కడా మెన్షన్ చేయకపోవడం గమనించవచ్చు.
నిజానికి ఈ రెండు మలయాళ సినిమాలు .. ఓటీటీ సైట్స్ లో ఉన్నాయి. ఒక వేళ ‘అనగననగా ఒక రౌడీ, ఇష్క్’ సినిమాలకు రీమేక్ వెర్షన్స్ అవే అని మెన్షన్ చేస్తే.. ఓటీటీలో అందుబాటులో ఉన్న ఆ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ముందే చూసేస్తారు. దాంతో ఆ సినిమా కథాంశంపై ఆసక్తి పోతుందని భావిస్తున్నారో లేక ఒరిజినల్ వెర్షన్స్ తో తెలుగు సినిమాలకి పోలికలు తెస్తారని జంకుతున్నారో తెలియదు కానీ.. ఈ సినిమాలు మలయాళ సూపర్ హిట్ మూవీస్ కు రీమేక్స్ అవడం మాత్రం నిజంగా ఆశ్చర్యమే. మరి ఈ రెండు సినిమాలూ తెలుగులో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తాయో చూడాలి.
Must Read ;- అఆ.. అఖండ వర్సెస్ ఆచార్య











