సస్పెండైన జడ్జి రామకృష్ణ బెయిల్ పిటిషన్ హైకోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. దీనిపై ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సస్పెండైన జడ్జి రామకృష్ణ ను జైల్లో ఉంచడమే మంచిదని, విడుదల చేస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన్ని జుడీషియల్ కస్టడీలో ఉంచడమే అందరికీ మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి కేసు విచారణను జూన్ 15కు వాయిదా వేసింది. సస్పెండైన జడ్జి రామకృష్ణ తరఫున మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలను వినిపించారు. సస్పెండైన జడ్జి తరపున వాదనలు వినిపించేందుకు హైకోర్టు మరో అవకాశం కల్పించింది.
సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు
సీఎం జగన్మోహన్‌రెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సస్పెండైన జడ్జి రామకృష్ణపై రాజద్రోహం కేసు నమోదైంది. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో తిరుపతిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఏప్రిల్ 14న అరెస్టైన రామకృష్ణకు బెయిల్ లభించలేదు. మరోసారి హైకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉండటంతో, ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. హైకోర్టు పూర్తిగా బెయిల్ నిరాకరిస్తే ఆ తరవాత రామకృష్ణ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
Must Read ;- ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కు.. వినోద్ దువాపై రాజద్రోహం కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు