టాలీవుడ్ లో ఎప్పటి నుంచో సమంతా కథా నాయికగా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. అయితే ఆమె పెళ్ళయ్యాకా గ్లామర్ పాత్రలను కాస్తంత తగ్గించి, నటనా ప్రధాన్యమున్న పాత్రలను, నాయికగా ప్రధాన్యమున్న పాత్రలను మాత్రమే అంగీకరిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇటీవల ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ లో శ్రీలంక మిలిటెంట్ గా అద్భుతంగా నటించి, యాక్షన్ సన్నివేశాల్లో సైతం అదరగొట్టింది. సమంత వల్లనే ఈ సిరీస్ బ్లాక్ బస్టరైందని చెప్పుకుతీరాలి.
ఇక సమంతా ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే పౌరాణిక చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా తాల్కాలికంగా నిలిచిపోయింది. ఈ సినిమా తన కెరీర్ లోనే చాలా ప్రత్యేకమైనది నిలిచిపోతుందని నమ్మకంగా చెబుతోంది సామ్. ఇక సామ్ త్వరలో ఓ స్టార్ హీరో సరసన కీలక పాత్ర చేయబోతోందని వార్తలొస్తున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. పవన్ కళ్యాణ్.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ నటిస్తున్న సినిమా.. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ తో పవన్ జోడీకట్టనున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఆయన సరసన సమంతా కథానాయికగా నటిస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ పవన్, సామ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో జీడీగా మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి సమంతా పవన్ తో జోడీకట్టడం విశేషంగా మారింది. మరి ఇందులో సామ్ పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి.
Must Read ;- సమంత పాత్ర కొంపముంచేలా ఉంది!