దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అసలుసిసలైన మల్టీస్టారర్ గా రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీని భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు చరణ్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రియులందరూ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్ డేట్ బయటకు వచ్చింది. అదేమిటంటే…ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నారు. అయితే.. చరణ్ సరసన సీతగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటిస్తుంది. ఆమధ్య చరణ్, ఆలియాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఆలియా ఓ పాట పాడబోతుందట. అలియా మంచి సింగర్ కూడా అన్న సంగతి బాలీవుడ్ సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. గతంలో ఆమె హైవే, హంటీ శర్మా కీ దుల్హనియా తదితర సినిమాలో పాటలు పాడి గాయనిగా కూడా అలరించింది.
ఇప్పుడు రాజమౌళి కోరిక పై ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ కి ఆలియాభట్ ఓ పాట పాడుతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ పాటను ఆమె పైనే చిత్రీకరించనున్నారని తెలిసింది. ఇదే కనుక నిజమైతే.. ఈ పాట ఆర్ఆర్ఆర్ కు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ సంచలన చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. బాహుబలితో చరిత్ర సృష్టించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనున్నాడో చూడాలి.
Must Read ;- సూపర్ స్టార్ మహేష్ పై రామబాణం ఎక్కుపెట్టిన రాజమౌళి