పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ పార్టీ తరపున ‘పంచాయతీకి పంచసూత్రాలు’ పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడంపై వైసీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ చర్య ఎన్నికల నియమావళికి విరుద్ధమని, చంద్రబాబుపై వెంటనే చర్యలు చేపట్టాలని.. వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగేవనీ, పార్టీ గుర్తులు, పార్టీ ప్రచారాలు చేయడం స్థానిక ఎన్నికలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు అందుకున్న ఎన్నికల కమిషన్, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. వెంటనే ఎస్‌ఈసీ, టీడీపీకి నోటీసులు జారీ చేసింది.
ఫిబ్రవరి 2వ తేదీ లోగా మేనిఫెస్టో విడుదలపై వివరణ ఇవ్వాలని కోరింది. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేసినట్టు తేలితే.. చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఏ ప్రాతిపదికన మేనిఫెస్టోను విడుదల చేశారో చెప్పాలని.. మీ వివరణ కనక సంతృప్తిగా లేకపోతే, ఎన్నికల నియమావళిని పాటించని కారణంగా చర్యలు తీసుకునే హక్కు ఎన్నికల కమిషన్‌కి ఉంటుందని చెప్పారు.
Must Read ;- పంచాయతీకీ.. పంచసూత్రాలు..