కరోనా జిల్లాలో అదోనిలో ఫిజియోథెరపి వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ఆడమ్ స్మిత్‌గా గుర్తించిన పోలీసులు. బైక్ పై వెళ్తుండగా అడ్డుకుని బండరాయితో కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మహేశ్వరి-ఆడమ్ నెల రోజుల క్రితం ప్రేమ వివాహాం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆడమ్ భార్య తన కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేసింది.
ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా వివాహాం చేసుకున్నందుకు తమ కుటుంబ సభ్యులే హత్య చేశారంటూ మహేశ్వరి ఆరోపిస్తున్నారు. మహేశ్వరి ఫర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫిర్యాదు మేరకు ఆమె కుటుంబ సభ్యలకు ఈ హత్యకు సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.











