ట్రాఫిక్ పోలీసులు అనగానే.. చేతిలో కెమెరా పట్టుకొని, ట్రాఫిక్ నిబంధనలను బ్రేక్ చేసినవాళ్ల ఫోటోలు తీస్తూ, చలాన్లు వసూలు చేసే విషయాలు గుర్తుకువస్తాయి. కానీ వాళ్లలోనూ సేవాభావం ఉందనే విషయం చాలామందికి తెలియదు. అందుకు ఉదాహరణ ఈ వీడియో
నిన్న బుధవారం కురిసిన వర్షాలకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉప్పల్ ఓ ప్రధాన రహదారిపై వర్షపు నీళ్లు బాగా నిలిచిపోయాయి. దాంతో పాటు రోడ్డుపై గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరిగ్గా అదే సమయంలో డ్యూటీలో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుండటంతో వెంటనే రంగంలోకి దిగారు. పలుగు పార చేతపట్టి, రోడ్డు ఉన్న గుంతల్లో మట్టి పోసి వర్షపు నీరు నిల్వకుండా శుభ్రం చేసి, ట్రాఫిక్ సమస్యను తీర్చారు. రోడ్లపై వర్షం నీటిని తొలగించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ ముగ్గురి కానిస్టేబుళ్లను ప్రశంసిస్తున్నారు. మీ సేవలకు సెల్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Must Read ;- సలాం.. శిల్పసాహు : ఐదు నెలల గర్భంతో డీఎస్పీ విధులు
Today @UppalTrPS Police clearing #waterlogging at Aditya Hospital, Uppal. @TelanganaDGP @TelanganaCOPs @cyberabadpolice @Rachakonda_tfc @TelanganaToday @DeccanChronicle @TOIHyderabad @eenadulivenews @ntdailyonline @ManaTelanganaIN pic.twitter.com/670y24awzr
— Rachakonda Police (@RachakondaCop) June 2, 2021











