రష్మీ గౌతమ్.. అందానికి కేరాఫ్ అడ్రెస్ . అందమైన చిరునవ్వుకి చిరునామా. హాట్ నెస్ ను బోల్డ్ నెస్ ను రంగరించి.. బుల్లి తెరమీద కుమ్మరించే క్యూట్ బ్యూటీ ఆమె. యాంకరింగ్ లో గ్లామర్ ను యాడ్ చేసే ఆచారం ఆమె నుంచే ప్రారంభమైంది. జబర్దస్త్ కామెడీ షో కి నవ్వించడం ఒక అలంకారమైతే.. రష్మీ నవ్వుతూ యాంకరింగ్ చేయడం మరో ఆకర్షణ.
దాదాపు ఎనిమిదేళ్ళ నుంచి అప్రతిహతంగా సాగిపోతున్న ఈ కామెడీ షోకి రష్మీ అల్లరి లేకపోతే రక్తి కట్టదు. ఆమె చిలిపి చేష్టలు లేకపోతే.. కుర్రకారుకు నిద్రపట్టదు. టోటల్ గా రష్మీ గౌతమ్ .. అందాల భరిణగా ఈ షోకి అమరిపోయింది. ఆమె ప్లేస్ లో వేరే ఎవరిని తీసుకున్నా ఆమె అంత అందంగా వారు షోను ఓన్ చేసుకోవడం జరగదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రష్మీ ఇటు బుల్లితెరమీద, అటు వెండితెర మీద తన అందాలతో చెలరేగిపోవడం ఆమె టాలెంట్ కు నిదర్శనం. ఇక ఆమె సోషల్ మీడియాలోనూ తరచుగా తన అందాల గ్లామర్ షో ను రన్ చేస్తూ వెళుతోంది. ఎప్పటికప్పుడు తన హాట్ అండ్ క్యూట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ నెటిజెన్స్ ను నిద్రకు దూరం చేస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ సోఫల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెత్తి మీద కొప్పుతో .. మెరూన్ కలర్ డ్రెస్ తో అప్సరసలా రివీలైంది. వివిధ భంగిమల్లో ఆమె దిగిన ఫోటోస్ కు ఇన్ స్టాలో బోలెడంత రెస్సాన్స్ వస్తోంది. అలాగే.. ఓ రేంజ్ లో కామెంట్స్ వచ్చిపడుతున్నాయి.
Must Read ;- ఇన్ స్టాలో అందంగా మెరుస్తోన్న శ్రీముఖి