విజయనగరం రాజ కుటుంబీకుల్లో అంతర్గతంగా ఉన్న మనస్పర్ధలు, వైషమ్యాలు రచ్చకెక్కుతున్నాయి. పైడితల్లి సిరిమానోత్సవం సాక్షిగా బహిర్గతమైన వైషమ్యాలు ‘ఇంతై ఒటుండింతై’ అన్న చందంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రతిష్టాత్మకమైన పూసపాటి వంశీయుల చరిత్రను మంటగలుపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రయోజనకరమైన పనులు అనేకం చేపట్టి విజయనగరం ప్రజల మనస్సుల్లో దేవుళ్ళుగా సుస్థిర స్థానం సంపాదించుకున్న విజయనగర రాజుల వారుసులైన యువరాణులు వ్యక్తిగత ప్రతిష్టలకు పోతూ ఆస్తుల వ్యామోహంలో ప్రజాప్రయోజనాలు మంటగలుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి నుండి వెనువెంటనే బయటపడి వారి సమయాన్ని ప్రజా ప్రయోజనాలకు వెచ్చించాలని, దుందుడుకు చర్యలను విడనాడాలని ప్రగతి కాముకులు కోరుతున్నాను.
1001 కొబ్బరికాయలు పంచిపెట్టా ..
అందరికీ పైడితల్లి అమ్మవారి పండుగ శుభాకాంక్షలు. అలాగే అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్భంగా 1001 కొబ్బరికాయలు విజయనగరం కోట నుండి తీసుకువచ్చి భక్తులందరికీ పంచడం జరిగింది. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.
– తన ఫేస్బుక్ వాల్‌పై సంచైత గజపతిరాజు
ఇతరులను అగౌరవ పరిచే ప్రయత్నం.. మీ పాత్ర తెలియజేస్తోంది
వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, మా విభేదాలు ఏమైనప్పటికీ, ప్రతి సంవత్సరం విజయనగరం కోట నుండి సిరిమానోత్సవం కలిసి చూడటం సంప్రదాయం. నా తల్లి , నేను ఈ సంవత్సరం హాజరు కావడానికి సంశయించాము కాని సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇష్టపడ లేదు. చేరుకున్న తరువాత, ఇతర కుటుంబ సభ్యులెవరూ లేరని మేము గ్రహించాము. ఇది ఒకప్పుడు విజయనగరం కుటుంబ కార్యక్రమం కాదు. నా తండ్రి కోసం 20 సంవత్సరాలు పనిచేసిన, 16 సంవత్సరాలు నన్ను ఎదగడం చూసిన వ్యక్తులు ఆ వ్యక్తి ఒత్తిడి కారణంగా మమ్మల్ని విడిచిపెట్టమని కోరారు. ఇతరులను అగౌరవపరిచే ప్రయత్నంలో మీ సొంత పాత్రను తెలుపుతుంది. వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా హాజరుకావడం మన హక్కు కాదా? నేను గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం హాజరవుతున్నాను.
-తన ఫేస్బుక్ వాల్‌పై ఊర్మిళ గజపతి రాజు
కుటుంబంలో పెరిగినప్పుడే ..
ఒక మనిషికి సరైన ప్రవర్తన, సాంప్రదాయాలు మరియు ఆచారాలు తెలియాలంటే ఒక కుటుంబంలో పెరిగినప్పుడే తెలుస్తాయి. 1001 కొబ్బరి కాయలు కొడితేనో .. పంచిపెడితేనో కాదు. సంచైత తాత రాజాసాహేబ్ పి.వి.జి.రాజు గారు మరియు తండ్రి ఆనంద్ గజపతి రాజు గారు ఉన్నప్పుడు వస్తే ఈ పద్ధతులు వాటంతట అవే తెలిసేవి. పి.వి.జి.రాజు గారు మరియు ఆనంద్ గజపతి రాజు గారు ఉన్నప్పుడు సంచైత ఎప్పుడూ అమ్మవారి పండుగకు గాని, మిగిలిన 105 దేవాలయాల పండగలకు గాని రాలేదు. పి.వి.జి.రాజు గారు బతికి ఉన్నప్పుడు , చనిపోయినప్పుడూ ఆమె రాలేదు. సింహాచలంలో జరిగిన ఆమె సొంత అక్క పెళ్లికి (ఆనంద్ గజపతి రాజు గారి పెద్ద కుమార్తె సుచరిత వివాహం) కుడా రాలేదు. ఆనంద్ గజపతి రాజు గారు బ్రతికి ఉన్నప్పుడు ఆమె రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత అకస్మాత్తుగా ఆమె వచ్చింది. అందువల్ల ఆమెకు ఎలా ప్రవర్తించాలో తెలియదు , తెలుసుకోవడానికి ప్రయత్నించనూలేదు. మొన్న కోట బురుజు మీద జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది. అమ్మవారి సిరిమానోత్సవాన్ని పి.వి.జి.రాజు గారి పూర్వీకుల నుండీ కుటుంబ సభ్యులందరూ కోట బురుజు మీద నుండి వీక్షించడం అనేది ఎన్నో ఏళ్ళుగా జరుగుతున్నసాంప్రదాయం. సంచైతకు అధికారం మీద ఉన్న యావ సాంప్రదాయాలపై లేదు. ఉంటే పూసపాటి వంశ వారసుడైన అశోక్ గజపతిరాజు గారిని అవమానించేది కాదు. ఇప్పుడు ఆనంద గజపతి రాజు గారి భార్యను, కుమార్తెను అవమానించేది కాదు.
-తన ఫేస్బుక్ వాల్ పై అదితి గజపతిరాజు
భూస్వామ్య మనస్థత్వాలకు చోటు లేదు ..
విజయనగరం కోటలో 27 అక్టోబర్ 2020 న జరిగిన సిరిమానోత్సవం పండుగకు సంబంధించి కొంతమంది వ్యక్తులు నకిలీ వార్తలు, తప్పు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. వేదిక కోట అయినప్పటి నుండి, చైర్ పర్సన్ మాన్సాస్ , ఆమె అతిథులకు వేడుకను చూడటానికి మొదటి వరుసను కేటాయించారు. అయినప్పటికీ కొంతమంది విస్తరించిన కుటుంబ సభ్యులు మగ పరివారంతో ముందస్తు సమాచారం లేకుండా లోపలికి వెళ్ళి ముందు రెండు వరుసలను ఆక్రమించారు మర్యాద లేకుండా మా చైర్‌పర్సన్, సంచైత గజపతి రాజు గారు, వారు కూర్చుని, తన కోసం ఒక కుర్చీని జోడించి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మాన్సాస్ కరస్పాండెంట్‌కు కేటాయించారు. ఈఓ పక్కన కూర్చున్న ఊర్మిలా, ఆమె తల్లి ఈ కార్యక్రమాన్ని 45 నిముషాల పాటు చూశారు, తరువాత వేదిక నుండి బయలుదేరారు, కాని తరువాత వారికి సీట్లు ఇవ్వలేదని పత్రికలకు సమాచారం ఇచ్చారు . పండుగ మధ్య మార్గం నుండి నిష్క్రమించారు. వారు రాయల్ కుటుంబానికి చెందినవారు కాబట్టి వారికి మహారాణి , యువరాణులకు చూపిన గౌరవం ఇవ్వవలసి ఉందని వారు పేర్కొన్నారు. అన్ని వేడుకలు విజయనగరం ప్రజలకు చెందినవని, భూస్వామ్య మనస్తత్వాలకు 21 వ శతాబ్దపు ఆధునిక ప్రగతిశీల ప్రజాస్వామ్య భారతదేశంలో స్థానం లేదని గౌరవ ఛైర్‌పర్సన్ సంచైతా గజపతి రాజు గారు నాకు స్పష్టంగా చెప్పారు. ఇది ప్రజల సూత్రం ద్వారా తప్పనిసరి , ప్రజల మరియు ప్రజల కోసం. అతిథులకు గౌరవం , తగిన మర్యాద ఉర్మిలా మరియు ఆమె తల్లికి ఇవ్వబడింది. ఆమె అవమానానికి గురైనట్లు వ్యాఖ్యానించింది ఎందుకంటే ఆమె ట్రస్ట్ యొక్క కరస్పాండెంట్ పక్కన కూర్చోవలసి వచ్చింది. కరస్పాండెంట్ ట్రస్ట్ యొక్క ప్రాధమిక ఆదేశం అయిన విద్యా సంస్థలకు నాయకత్వం వహిస్తారు. యువతి మరియు ఆమె తల్లి యొక్క ప్రవర్తన వారి అహంకారం, తాదాత్మ్యం లేకపోవడం , సాధారణ కార్మికవర్గం పట్ల సున్నితత్వం మాత్రమే నొక్కి చెబుతుంది.
– మాన్సాస్ గౌరవ చైర్‌పర్సన్ కార్యాలయం నుండి
విజయనగరం యువరాణుల రగడ ఏ స్థాయికి చేరుతుందో , ఏ విధమైన ప్రయోజనం చేకూర్చుతుందన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఫలితం ఎలావుంటుందో వేచిచూడాల్సిందే.