పాల దుకాణంలో చికెన్ దొరుకుతుందా.. కూరగాయల దుకాణంలో మందులు అడగగలమా.. ఎవరైనా వింటే పిచ్చిపట్టిందా అని అంటారు. అలాగే కూల్చివేతలు తప్ప కట్టడాలనేవే ఎరుంగని జగనన్న ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంచుతున్నారంటే ప్రజలు కూడా నమ్మలేకపోతున్నారు. ఈ కట్టడాన్ని ఎవరు కూల్చారు.. కట్టడాలను ఎవరు ఆపారు అంటే జగన్.. ఈ కట్టడాలను ఎవరు కట్టారు అంటే ‘చంద్రబాబు’ అనేలా ప్రజల్లోకి వెళ్లింది. అందుకేనేమో జగనన్న ఇళ్లపట్టాలను పంచుతున్నాడంటే ‘చంద్రబాబు’ కదా ఇలాంటి పనులు చేసేది అనుకుని.. ప్రజలు కూడా చంద్రన్న పట్టాగా భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలే అనంతపురంలో చోటుచేసుకున్నాయి.

రాష్ట్రంలో జరుగుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నాయకులకు జనం అనేక చోట్ల షాక్ ఇస్తున్నారు. అనంతపురం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలకు శనివారం ఈ వింత అనుభవం ఎదురైంది. యాడికి మండల కేంద్రంలో నాగమ్మ అనే మహిళకు పట్టా ఇచ్చిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. ‘ఈ పట్టా ఎవరిచ్చారమ్మా’ అని అడిగారు. ‘చంద్రన్న సారు ఇచ్చారు’ అని ఆమె బదులివ్వడంతో.. అవాక్కవడం ఎమ్మెల్యే వంతయింది. దీంతో.. అక్కడున్న వైసీపీ నాయకులు అప్రమత్తమై.. జగన్ పేరు చెప్పాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ఆమెను రెండోసారి ప్రశ్నించారు. ఈ సారి ఆమె జగన్ పేరే చెప్పారు. కదిరిలోనూ ఎమ్మెల్యే సిద్దారెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. పట్టా ఎవరిచ్చారంటూ కొందరు లబ్దిదారుల్ని ఎమ్మెల్యే అడగ్గా.. చంద్రన్న ఇచ్చారంటూ వారు ఆయనకు దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ఈ ఘటనతో అక్కడున్న అధికార పార్టీ నేతలందరూ తెల్లమొహాలేశారు.
ఓడినంత మాత్రానా ‘అభివృద్ధి’ మార్క్ చెరుగుతుందా..
ప్రజలు మమ్మల్ని 151 సీట్లతో గెలిపించారు అని విర్రవీగే ప్రభుత్వానికి.. ప్రజల గుండెల్లో చంద్రబాబు స్థానమెంటనేది.. ఈ మాటలతో కాస్తైనా అర్ధమయిందో లేదో.. అర్థమయినా ఉపయోగమేమీ లేదులెండీ.. ఓడినంత మాత్రానా అభివృద్థికి మారుపేరుగా నిలిచిన చంద్రబాబు పేరు చెరపలేరనేది అక్షరాల సత్యం. రిక్తహస్తాలతో ఇచ్చిన రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో పరిగెత్తించడంతోపాటు.. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ ఎటువంటి లోటూ లేకుండా చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని ప్రజలే చెప్తున్నారు.. వేరే ఆధారాలు ఏం కావాలి?
Also Read: నేను ట్రంప్‌నే లెక్కచేయను.. జగన్మోహన్ రెడ్డి ఎంత: కెఏ పాల్











