బ్లాక్ బస్టర్ తీసినా.. ఫ్లాప్ తీసినా.. దర్శకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టార్ స్టాటస్ ఎప్పటికీ చెక్కుచెదరదు. ఆయనలోని సెన్సాఫ్ హ్యూమర్, ఇంటెలిజెన్స్ .. టాలీవుడ్ లో మిగతా దర్శకులకన్నా ప్రత్యేకంగా నిలుపుతోంది. అందుకే అందరు స్టార్ హీరోలూ.. త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఎప్పటికప్పుడు కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆయన రాసే మాటల్ని తమ నోటి నుంచి పలికితే.. ఆ కిక్కే వేరని భావించడం గురూజీ గొప్పతనం. బిఫోర్ లాస్ట్ ఇయర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాతో సూపర్ హిట్టు కొట్టిన త్రివిక్రమ్.. ఈ ఏడాది బిగినింగ్ లోనే ‘అల వైకుంఠపురములో’ మూవీతో బ్లాక్ బస్టర్ కైవసం చేసుకున్నారు.
అయితే ఈ సినిమా విడుదలయ్యాకా.. యన్టీఆర్ హీరోగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ మెంట్ జరిగింది. లాక్ డౌన్ రాకుంటే.. పరిస్థితి వేరేలా ఉండేదేమో.. తెలియదు కానీ.. దాని ఎఫక్ట్ వల్ల.. కొన్ని సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ క్రమం తప్పాయి. అందులో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ ఒకటి.
నిజానికి ఆర్.ఆర్.ఆర్ సినిమా కంప్లీట్ అయ్యాకా.. త్రివిక్రమ్ సినిమా ప్రారంభించాలనుకున్నాడు తారక్. కొవిడ్ 19 వల్ల షూటింగ్స్ ఆగిపోవడంతో .. ‘ఆర్.ఆర్ .ఆర్’ సినిమా రిలీజ్ డేట్ ఛేంజ్ చేయాల్సి వచ్చింది. దాని వల్ల తారక్ ఇంకా ఈ సినిమా షూటింగ్ లోనే ఉన్నాడు. దాంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో యన్టీఆర్ నటించే సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి మరింత టైమ్ పట్టేలా ఉంది.
అందుకే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ .. మహేశ్ తో హ్యాట్రిక్ కాంబోకి రెడీ అవుతాడనే వార్తలు వినిపించాయి. మహేష్ కూడా పాజిటివ్ గా స్పందించాడని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. అయితే ఒకవేళ ఇది నిజమే అనుకుంటే ఇప్పట్లో ఈ కాంబినేషన్ సాధ్యపడేనా అనే డౌట్ వస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేశ్ తో రాజమౌళి సినిమా తీయబోతుండడమే దానికి కారణం. అంతేకాదు.. ప్రస్తుతం మహేశ్ పరశురామ్ ‘సర్కార్ వారి పాట’ మూవీలో నటించే సన్నాహాల్లో ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అలా అని బన్నీతో సినిమా చేయాలనుకున్నా .. సుకుమార్ ‘పుష్ప’ సినిమా వల్ల ఇప్పట్లో అది సాధ్యం కాదు.
ఒకవేళ త్రివిక్రమ్ ఇప్పటికిప్పుడు వెంకీతో కానీ, చిరు తోకానీ సినిమా చెయ్యాలనుకున్నా.. ‘నారప్ప’ తర్వాత వెంకీ .. అనిల్ రావిపూడితో ‘ఎఫ్ 3’ మూవీ చేయబోతున్నాడు. ‘ఆచార్య’ తర్వాత చిరంజీవి.. ‘లూసిఫర్’ రీమేక్ మీద దృష్టి పెట్టనున్నాడు. ఈ ప్రకారం చూసుకున్నా ఈ ఇద్దరితోనూ త్రివిక్రమ్ సినిమా చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు. మరి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కంప్లీట్ అయ్యే వరకూ యన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఎదురుచూడక తప్పదు. మరి ‘ఆర్.ఆర్.ఆర్’ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో . తారక్ ఎప్పుడు త్రివిక్రమ్ సినిమా కి రెడీ అవుతాడో వెయిట్ అండ్ సీ.