స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నటన, డాన్స్ తోనే కాకుండా సామజిక బాధ్యతతో కూడా అనేక సార్లు వార్తల్లో నిలిచాడు. ఆమధ్యకాలంలో స్వాతంత్ర దినోత్సవం నాడు ‘ఐయామ్ దట్ చేంజ్’ అనే షార్ట్ ఫిలింలో నటించాడు. ఆ షార్ట్ ఫిలింకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. అంతే కాకుండా ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఎడ్యుకేట్ చేశాడు బన్నీ. ఇలా తనకు అవకాశం ఉన్నప్పుడల్లా తనలోని సామాజికి సృహను బయట పెడుతుంటాడు.
Must Read ;- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత
బన్నీ అభిమానులు కూడా తమ హీరోకు ఉన్న సామజిక బాధ్యత గురించి అనేక సార్లు సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నారు. తాజాగా ఉదయపూర్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది అల్లు అర్జున్ కు గల సామజిక బాధ్యతను చూసి కృతఙ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే ఈమధ్యనే మెగా డాటర్, నాగబాబు ముద్దుల కూతురు నిహారిక వివాహం ఉదయపూర్ ప్యాలస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటుగా అల్లు ఫ్యామిలీ కూడా హాజరైంది. ఆ సమయంలో బన్నీ ఉదయపూర్ ఎయిర్ పోర్టులో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా మాస్క్ ధరించాడు. తను ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వెళ్లే వరకు మాస్క్ తీయలేదు.
ఇందుకు ఉదయపూర్ ఎయిర్ పోర్ట్ వారు తమ ట్విట్టర్ హేండిల్ ద్వారా అల్లు అర్జున్ కు కృతఙ్ఞతలు తెలిపారు. ‘ఉదయపూర్ ఎయిర్ పోర్ట్ మీకు ధన్యవాదాలు తెలుపుతోంది. కోవిడ్ నిబంధనలు పాటించినందుకు అలాగే తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించకుండా మాస్క్ ధరించినందుకు మీకు కృతఙ్ఞతలు’ అంటూ ట్విట్ చేసింది. అంతే కాకుండా బన్నీతో దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ట్విట్ ను బన్నీ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు ఉన్న సామజిక బాధ్యత గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. బన్నీకి ఫ్యాన్స్ అయినందుకు గర్వపడుతున్నామని అంటున్నారు.
Also Read ;- ‘పుష్ప’ సినిమాలో అంతమంది విలన్సా.. నిజమేనా?
We ensure our passengers fly safe and they support we remain safe to perform by following norms .Thank you all for remembering to wear your masks @alluarjun @aaiRedNR #Unite2FightCorona #WearYourMask pic.twitter.com/Gcjmavas9f
— Udaipur Airport (@AirportUdaipur) December 13, 2020