బిగ్ బాస్ 4 ఫైనల్ రేపే. ఫైనల్ కి ఒక్క రోజు మాత్రమే ఉండడంతో విన్నర్ గా ఎవరు నిలుస్తారనేది మరింత ఆసక్తి కలిగిస్తుంది. స్టార్ మా టీవీ ఫైనల్ ఎపిసోడ్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫైనల్ కి గెస్ట్ గా చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. మెగాస్టార్ చిరంజీవే గెస్ట్ అని కన్ ఫర్మ్ అయ్యింది. అయితే.. సీజన్ 3 కి చిరంజీవి గెస్ట్ గా వచ్చినప్పటికీ.. హీరో శ్రీకాంత్ కూడా వచ్చారు. ఆయన కూడా ఫైనల్ లో పాల్గొనడం జరిగింది.

అయితే.. ఈసారి చీఫ్ గెస్ట్ చిరంజీవి కాకుండా ఇంకా ఎవరైనా రానున్నారా..? అనేది ఆసక్తి కలిగిస్తుంది. ముగ్గురు హీరోయిన్లు ఈ షోకు రానున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. కింగ్ నాగార్జున తనయుడు యువ సమ్రాట్ నాగచైతన్య కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారట. నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమా లవ్ స్టోరీ. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో చైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించింది.
ఇక అసలు విషయానికి వస్తే… బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి నాగచైతన్య, సాయిపల్లవి స్పెషల్ గెస్ట్ లుగా రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మెహ్రీన్, లక్ష్మీరాయ్ కూడా రాబోతున్నారట. వీరిద్దరూ చేసే డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా ప్లాన్ చేశారట. మొత్తానికి బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ ను ఓ రేంజ్ లో ప్లాన్ చేసారని తెలుస్తుంది. ప్రచారంలో ఉన్న ఈ వార్తలను బట్టి ఈసారి కూడా బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ రికార్డ్ టీఆర్పీ సాధించడం ఖాయం అనిపిస్తోంది. మరి.. ఈ ఫైనల్ ఎపిసోడ్ ఎంత టీఆర్పీ సాధిస్తుందో చూడాలి.
Must Read ;- బిగ్ బాస్ 4 విజేత ఎవరో బయటపెట్టిన అవినాశ్..











