అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటూ బెయిల్‌పై ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయడం లేదంటూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో విర్చువల్ విధానంలో విచారణ జరిగింది. ఎంపీ రఘురామరాజు వేసిన పిటీషన్ విచారణకు అర్హమైనదని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 27వ తేదీకి వాయిదా వేశారు.
ఆ నమ్మకం నాకుంది..
ఈ కేసులో తమ న్యాయవాది సీనియర్ కౌన్సిల్ ఆదినారాయణ వాదనలు వినిపించారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు వెల్లడించారు. మేము, మా న్యాయవాది చాలా ఆశాభావంగా ఉన్నామని, కోర్టు తీర్పు రిజర్వులో ఉంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేనని ఆయన తెలిపారు.అయితే తనకు అనుకూల తీర్పు వస్తుందన్ననమ్మకం తనకు కలిగిందని, త్వరలో తన లక్ష్యం నెరవేరబోతోందని ఎంపీ రఘురామరాజు చెప్పారు. అయితే జగన్ బెయిల్ రద్దు తీర్పు వెలువరించాలంటే ముందుగా కోర్టు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా 27న వెలువడనున్న తీర్పుపై అందరూ ఆసక్తిగా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Must Read ;- జగన్ బెయిల్ రద్దుపై రేపే విచారణ.. మరో బాంబు పేల్చిన రఘురామరాజు