మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు అనే సామెత ఊరికే రాలేదు.ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న పరీక్షల తతంగాన్ని చూస్తుంటే అదే అనిపిస్తోంది. ముందు పదవ తరగతి పరీక్షలు.. ఇప్పుడు ఇంటర్ పరీక్షలు..రద్దు చేయడానికి జగన్ సర్కార్ తెగ ఫ్రస్టేట్ అవుతోంది.రద్దు చేయాలని తెలుసు..ఇప్పుడున్న కరోనా సంక్షోభంలో పరీక్షలు నిర్వహించడం కష్టమే.. ఆ పరీక్షలు రాయడమూ విద్యార్ధులకు కష్టమే. ఎందుకంటే అనేక కుటుంబాలు కరోనా బాధిత కుటుంబాలుగా మిగిలాయి.వారిలో ప్రతి ఇంట్లో తండ్రి లేక తల్లి లేక ఇంకొకరో చనిపోయారు. అలాంటి స్దితిలో ఆ ఇంట్లోని విద్యార్ధులు పరీక్షలకు ప్రిపేర్ కాగలరా? కాలేరని ప్రభుత్వానికీ తెలుసు. అయినా ఒప్పుకోదు.
పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న లోకేష్..
ఎందుకంటే.. టీడీపీ మాజీ మంత్రి లోకేష్ ఈ విషయంలో పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నాడు.ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా… లోకేష్ పోరాటానికి తల వంచినట్లు అవుతుంది. అది ఏ మాత్రం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఆ విషయంలో ఎంత ఒత్తిడి వచ్చినా.. పరిస్ధితులు ఎంత బలవంతపెడుతున్నా నిర్ణయం మాత్రం తీసుకోవడం లేదు. దాదాపు దేశంలో 16 రాష్ట్రాలలో పరీక్షలు రద్దు చేశారు.కేంద్రం అయితే సీబీఎస్ఈ పదవ తరగతి, 12వ తరగతి (ఇంటర్) పరీక్షలను రద్దు చేసింది.మరి వీరందరికీ ఉన్న ఆలోచన.. జగన్‌కు లేదంటారా?ఉంది , అయినా లోకేష్ మొహం చూసే ఆయనకు నిర్ణయం తీసుకోబుద్ధి కావటం లేదని స్పష్టంగా అర్ధమవుతూనే ఉంది.
తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల రద్దు చేయగా..
ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవ తరగతి పరీక్షల రద్దును ప్రకటిస్తే.. ఇక్కడి కంటే ఎక్కువ కేసులున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరీక్షల షెడ్యూల్, ఏర్పాట్ల గురించి అదే సమయంలో అక్కడి విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ పెట్టారు.ఈ రెండిటిని కంపేర్ చేసుకున్నవారికి నవ్వాలో.. ఏడ్వాలో అర్ధం కాలేదు. అదేమంటే..పరీక్షలు లేకుండా పాస్ చేయిస్తే.. విద్యార్ధుల భవిష్యత్‌పై రిమార్క్ పడుతుందని..తర్వాత వారే నష్టపోతారని ప్రభుత్వం వాదిస్తోంది. కాని పరిష్కారం ఉంటే.. సమస్య సాల్వ్ చేయొచ్చు.. ఇప్పుడు పరిష్కారం లేదు కాబట్టే..పరీక్షల రద్దు కోరుతున్నారనే విషయం ప్రభుత్వం తలకెక్కించుకోవడం లేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ..పరీక్షలు ఉంటాయో, ఉండవో.. ప్రిపేర్ అవ్వాలో అవసరంలేదో అర్ధం కాని అయోమయంలో విద్యార్ధులను పడేసింది.
ఈ అయోమయం అంతా కేవలం లోకేష్ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు..ప్రభుత్వంపై పోరాడుతున్నందుకు అన్న విషయం అందరికీ అర్ధమవుతూనే ఉంది. మరి ఎప్పటికి జగన్మోహన్ రెడ్డి ఆ మేనియా నుంచి బయటపడి..పరీక్షల రద్దుపై సరైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Must Read ;- ప్రభుత్వ పట్టింపులు.. కరోనాకు బలవుతున్న ఉపాధ్యాయులు











