ఏపీలో పదో తరగతి పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని విద్యాశాఖా మంత్రి సురేష్ ప్రకటించారు. పదో తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వకపోతో భవిష్యత్తులో వారికి చాలా సమస్యలు వస్తాయని ఆయన గుర్తు చేశారు.పరీక్షల నిర్వహణకు ఇంకా మూడు వారాల సమయం ఉంది కాబట్టి,ఒక ప్రణాళిక ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.దేశంలో అనేక రాష్ట్రాలు కూడా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.పదో తరగతి విద్యార్ధులకు గ్రేడింగ్ ఇవ్వకపోతే వారికి ట్రిబుల్ ఐటీల్లో ప్రవేశాలు కూడా కష్టమైపోతుందని సురేష్ గుర్తు చేశారు.
షెడ్యూల్ ప్రకారమే..
ఏపీలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వెల్లడించారు.పది పరీక్షలు రద్దవుతాయని విద్యార్ధులు,వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. అందుకే విద్యార్ధుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పది పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సురేష్ ప్రకటించారు.
Must Read ;- నాడు పరీక్షల రద్దుపై, నేడు APPSC అక్రమాలపై.. మరో ఉద్యమానికి లోకేష్ సిద్ధం