ఆందోళనలో గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు ..
నవరత్నాల్లో భాగంగా జగన్ రెడ్డి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు గ్రామ, వార్డు సచివాలయాలను ప్రవేశపెట్టి సెప్టెంబర్, 2019 న 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు. రెండేళ్లు ప్రొఫిషనల్ పిరియడ్ ముగియగానే ఉద్యోగ భద్రత కల్పింస్తానని హామీ ఇచ్చాడు. ఈ ఏడాది సెప్టెంబర్ తో ఉద్యోగుల రెండేళ్లు పూర్తైయినా .. దీనిపై ప్రభుత్వం నుంచి ఒక స్టేట్మెంట్ లేదు. గడిచిన రెండేళ్ల నుంచి సచివాలయం ఉద్యోగులు ఎన్నో కీలమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఈ రెండేళ్లు నుంచి కూడా ఎటువంటి భత్యాలు ఇవ్వకుండా కేవలం రూ. 15 వేలు ఇస్తూ నెట్టుకొస్తున్నారు. ఉద్యోగాలిచ్చే సమయంలో ప్రభుత్వ హామీ ప్రకారం రెండేళ్ల తరువాత పర్మినెంట్ చేసి స్కేల్ ఇస్తానన్న ఒప్పందం ముగిసి ఈ నెలతో రెండు నెలలు కావస్తున్న ప్రభుత్వం నుంచి కానీ, జగన్ రెడ్డి నుంచి ఎటువంటి ప్రకటన రాకపోకవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థతి ఉద్యోగులది. ఇటీవల నిర్వహించిన డిపార్ట్మెంటల్ పరీక్షలు కూడా రాశారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి కూడా ఇంతవరకు పర్మినెంట్ ఉత్తర్వులు ఇవ్వలేదని వాపోతున్నారు.
భారం పెరుగుతోందనే .. చేతులెత్తేసిన ప్రభుత్వం
ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అనాదిగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించలేక తలమునకలౌతున్న తరుణంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ అంశం మరో గుదిబండలా మారింది. అందుకే మాట దాటేవేసే ప్రయత్నం జరుగుతోందని ఉద్యోగులే బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సచివాలయంలోని ఉద్యోగులను పర్మినెంట్ చేసి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలంటే ప్రభుత్వానికి మరో నాలుగు వందల కోట్లు అదనపు భారం పెరుగుతోందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలివ్వడానికే ప్రతినెల కేంద్రం వద్ద చేతులు చాచుతున్న నేపథ్యంలో ఈ ఆదనపు భారాన్ని మోసే దైర్యం చేయడంలేదన్న ఆరోపణలు లేకపోలేదు. మరోపక్క జేఏసీ సమ్మె సైరన్స్ మోగిస్తున్న తరుణంలో వారికి పీఆర్సీ, డీఏలు, వాడుకున్న రూ.1600 కోట్లు ఎలా రిప్లేస్ చేసి, వారిని శాంతింపజేయాలని అర్థంకాక తలపట్టుకుంటుంది ప్రభుత్వం. ప్రస్తుత పరిణామాలను పరిగణలోకి తీసుకుని సచివాలయాల సిబ్బంది తమ ఉద్యోగాల పర్మినెంట్ చేసే అంశం హామీగానే మిగిలిపోతుదేమోనని ఉద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు, ప్రభుత్వ సేవలంటూ సచివాలయం సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. దీనితోడు బయోమెట్రిక్ తీసుకొచ్చి సమయానికి రాకుంటే జీతాలు కట్ చేస్తున్నారు. ఉద్యోగాలు పర్మినెంట్ చేయకుండా విపరీతమైన పని ఒత్తిడిని ఇవ్వడమేంటి? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు చూసి డిమాండ్స్ నెరవేర్చుకునేందుకు కార్యచరణ ప్రకటించాలే అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
Must Read ;- జగన్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఏపీ ఉద్యోగులు..! దెబ్బకు అలర్టైనా పోలీసులు!!











