సూపర్ స్టార్ రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రజనీ కాంత్ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఇప్పుడు తమిళ రాజకీయాలు మరింత వేడెక్కి ఉండేవి. ప్రస్తుతం రజినీ కాంత్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. పైగా చెన్నైలో ఉంటే వివిధ పార్టీల నుంచి రజినీ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కారణం ఏదైనా గానీ ‘అన్నాత్తే ’ షూటింగ్ కు రజినీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరో వారం రోజుల్లో ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలవుతుంది.
ఈ సినిమాకి సంబంధించి మరో అప్ డేట్ ఏమిటంటే జగపతి బాబు ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ లింగా, కథనాయకుడు చిత్రాల్లో నటించారు. జగపతిబాబు ఇందులో నటిస్తున్నట్లు సన్ పిక్చర్స్ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. జగపతిబాబు విలన్ గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రజినీ అనారోగ్యానికి గురై ఇక్కడ చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇకనుంచి ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయాలని రజినీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడు శివకు రజినీ స్వయంగా ఫోన్ చేసి షూటింగ్ కు ఏర్పాట్లు చేసుకోవలసిందిగా సూచించారట. ఇందులో రజినీ సరసన నయనతార నటిస్తోంది. మరో కీలక పాత్రను కీర్తి సురేష్ పోషిస్తోంది. నవంబరు 4న ఈ సినిమాని విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ లోగా రజినీ మరో సినిమాని కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులకు రజినీ ఓకే చెప్పారు. మరి ఈ సినిమా తర్వాత రజినీ చేయబోయే సినిమా ఏమై ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.
Must Read ;- ఇక్కడ ఆచార్య అక్కడ అన్నాత్తే
.@IamJagguBhai joins the cast of #Annaatthe.@rajinikanth @directorsiva @immancomposer #Nayanthara @KeerthyOfficial pic.twitter.com/k9ZHVLUNNx
— Sun Pictures (@sunpictures) March 16, 2021











