చేదుగా ఉండే కాకరకాయే ఇప్పుడు వారికి తియ్యగా అనిపిస్తోంది. ఒకప్పుడు వద్దన్నవారే ఇప్పుడు ఆయనే కావాలంటున్నారు. ఒకప్పుడు శాపనార్ధాలు పెట్టినవారే.. ఇప్పుడు దండాలు పెడుతూ దీవెనలు కూడా అందిస్తున్నారు. నిజంగా ఎంత విచిత్రం. ఒకప్పుడు సవాళ్లు విసురుకుని కోర్టులకెక్కి తొడలు గొట్టుకున్నవాళ్లే ఇప్పుడు ఒకరికొకరు కితాబులిచ్చుకుంటున్నారు. అప్పటి యుద్ధంలో నిజాయితీ వైపు నిలబడినవారు ఇప్పుడు వెర్రి పుష్పాలు అయిపోయారు. అవును జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ఎపిసోడ్‌లో నిమ్మగడ్డకు మద్దతుగా నిలబడ్డవారంతా ఇప్పుడు పిచ్చి చూపులు చూడాల్సిన పరిస్ధితి వచ్చింది.
ఆయనుండగానే అన్నీ కంప్లీట్ చేయాలంటూ..
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలు చాలా బాగా నిర్వహించారు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎటూ లీగల్ క్లియరెన్స్ వచ్చేసింది కాబట్టి.. అవి కూడా నిమ్మగడ్డ రిటైరయ్యేలోపు పూర్తి చేస్తే బాగుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆశ్చర్యంగా ఉంది కదా.. అవును నిజమే. ఆయనుండగా అసలు ఎన్నికలు పెట్టొద్దని పట్టుబట్టిన వైసీపీ ఇప్పుడు ఆయనుండగానే అన్నీ కంప్లీట్ చేయాలంటోంది. అంతగా వారికి నిమ్మగడ్డ పరోక్షంగా సహకరిస్తున్నారు.
AlsO Read ;- తాత ఆవేశమే గాని తండ్రి ఆలోచన లేదా.. జగన్ తీరుపై విశ్లేషణలు
మీడియాలో గొడవలన్నీవచ్చినా..
కేవలం జీవోలు, లేఖలకే పరిమితమైన నిమ్మగడ్డ ఎన్నికల్లో అక్రమాల అడ్డుకోవటంలో సంపూర్ణంగా ఫెయిలయ్యారు. కేవలం తన పంతం నెగ్గింది.. ఇక చాలు అన్నట్లే ఆయన వ్యవహరిస్తున్నారు. పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వైసీపీ తరపున పని చేస్తున్నట్లు ప్రత్యక్షంగా కనపడుతున్నా కూడా ఎలాంటి యాక్షన్ కూడా నిమ్మగడ్డ తీసుకోలేదు. మీడియాలో గొడవలన్నీ వస్తుంటే.. బెదిరింపులు, కేసులు, దాడులు అన్నీ వస్తున్నా సరే.. ఎన్నికలు ప్రశాంతగా జరిగాయని.. విజయవంతంగా ముగిశాయని చెప్పడం నిమ్మగడ్డకే చెల్లింది.
అంతగా కోఆపరేట్ చేశాక..
అంతగా కోఆపరేట్ చేశాక.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా వారి హయాంలోనే జరగాలనుకోవడంలో తప్పేముంది. అసలు జగన్మోహన్‌రెడ్డి ఇఫ్పటికే రియలైజ్ అయి ఉంటారు. కరోనా గురించి పట్టించుకోకుండా అనవసరంగా నిమ్మగడ్డను నానా మాటలన్నాను.. అసలు ఇద్దరం కూర్చుని మాట్లాడుకుని ఉంటే.. పరిస్ధితి ఇక్కడిదాకా కూడా వచ్చేది కాదని.. ఫీల్ అయి ఉంటారు.
ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే..
జెడ్పీటీసీ ఏకగ్రీవాలు, మున్సిపల్ ఏకగ్రీవాల్లో నామినేషన్లకు మళ్లీ అవకాశమిచ్చారు కదా.. నిమ్మగడ్డ ఏమీ చేయకపోవడమేంటని అడగొచ్చు. ఇక్కడే ఉంది అసలు కిటుకు.. ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్ గా ఇవ్వమని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో కోరాయి. ఆ పని మాత్రం చేయలేదు. కేవలం ఎక్కడైతే బెదిరింపులు వచ్చాయనుకుంటున్నారో.. వారు వచ్చి కంప్లయింట్ ఇవ్వాలని.. అప్పుడు నామినేషన్ మళ్లీ వేయనిస్తామని ఆర్డరిచ్చారు.ఈ ఆర్డర్ కోర్టు ముందు నిలబడదని ఎవరికైనా అర్ధమవుతోంది. అయినా అలా ఇచ్చారంటే అర్ధమేంటి? అలా కాకుండా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే.. ఈరోజు కోర్టు నుంచి ఆదేశాలు వేరేగా ఉండేవి. కాని అలా చేయకుండా వైసీపీ బలవంతపు ఏకగ్రీవాలకు నో చెబుతూనే ఎస్ చెప్పేశారు నిమ్మగడ్డ. అందుకే వైసీపీ ఆయన హయాంలోనే మిగతా తంతు కూడా ముగిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. తప్పేముంది.. నిజమే కదా.
Must Read ;- రెచ్చిపోదాం బ్రదర్.. వైసీపీ నేతలకు అధినేత అండ