సౌత్ అందాల తార నయన తార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ల ప్రేమాయణం గురించి అందరికీ తెలుసు. మూడేళ్ళు గా డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరూ .. చెట్టా పట్టాలేసుకొని తిరగని ప్రాంతం లేదు, చూడని ప్రదేశం లేదు. అయినా సరే పెళ్ళిమాట ఎవరైనా ఎత్తితే మాత్రం తప్పించుకు తిరిగేవారు ఈ ప్రేమికులు. ఇటీవల సోషల్ మీడియాలో విఘ్నేష్ పోస్ట్ చేసిన నయన్ రింగ్ ఫోటో చూసిన జనానికి …వారి ఎంగేజ్ మెంట్ అయిపోయిందనే కన్ఫర్మేషన్ కు వచ్చేశారు. అంతేకాదు ఈ జంట.. త్వరలోనే విదేశాల్లో పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.
అతి తక్కువ బంధుమిత్రుల సమక్షంలో నయన్, విఘ్నేష్ ల పెళ్ళి జరగబోతోందట. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఈ ఇద్దరూ పక్కాగా ప్లాన్ వేసుకున్నారట. ఒకటి రెండు రోజుల్లో మీడియా ముందుకొచ్చి..ఈ జంట తమ పెళ్ళి గురించి క్లారిటీ ఇస్తారట. ప్రస్తుతం ఈ వార్త తమిళ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం నయన్ పెళ్ళి వార్త గురించి ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు అభిమానులు.
Must Read ;- నయన్, విఘ్నేష్ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా?