July 4, 2026 1:49 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు.. బీజేపీ వైపు జేసీ చూపు?

జగన్ సీఎం అయ్యాక జేసీ బ్రదర్స్‌ చాలా అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్‌రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని, దీంతోనే చంద్రబాబుపై ఓ ఇంటర్వ్యూలో విమర్శలు చేశారన్న  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

January 17, 2021 at 11:23 AM
in Andhra Pradesh, Editors Pick, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అనంతపురం జిల్లాలో టీడీపీ కీలక నేత జేసీ దివాకర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ ఇంటర్వ్యూలో చేసిన విమర్శలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కొన్ని అనుమానాలకు కూడా తావిస్తున్నాయి. అవతల ఉన్నది ఎవరైనా.. తాను చెప్పాలనుకున్నది చెప్పడం, అనాలకున్నది అనడం అలవాటు ఉన్న జేసీ దివాకర్ రెడ్డి..ముందు చూపుతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. 1978 నుంచి జేసీ కుటుంబం రాజకీయాల్లో కీలకంగా ఉంది. ఇటు ఉమ్మడి ఏపీలో, అటు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా,  రాయలసీమలో ఏ పార్టీ ఆధిపత్యం సాగించినా జేసీ కుటుంబం తన పట్టును నిలుపుకుంటూ వస్తోంది. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక తమ కుటుంబం చాలా అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, రోజుకో కేసుతో వెంటాడుతున్నారనే అభిప్రాయం ఆ కుటుంబానికి ఉన్న నేపథ్యంలోనే జేసీ దివాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కూడా గమనించవచ్చు.

బీజేపీ జాతీయ కార్యదర్శితో భేటీ..

గత నెలలో చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో జేసీ మాట్లాడుతూ..పోలీసులపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదైంది. బెయిల్ పేపర్లు వచ్చినా.. జేసీ దివాకర్‌రెడ్డి ఐదు గంటలకు పైగానే..స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. ఆ తరువాతి రోజే అంటే..జనవరి 5న జేసీ దివాకర్‌రెడ్డి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో చాలా సేపు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్‌రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం మొదలైంది. దీనిపై జేసీ తనదైన శైలిలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయి. బీజేపీలో చేరతారా అనే ప్రశ్నకు ఆయన.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలిపినప్పుడు బీజేపీలో చేరతానని సెటైర్ వేశారు. ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో కొన్ని అంశాలు కూడా కీలకంగా మారాయి.

కనిపిస్తున్న నిరాశ..

చంద్రబాబు టైం వేస్ట్ చేస్తారని చెబుతూనే..ఆయన మారతారనే ఆశ ఉండేదని, ఇక మార్పు వస్తుందన్న నమ్మకం కూడా పోయిందన్నారు. అంటే చంద్రబాబు నుంచి మార్పును జేసీ ఆశించి ఉండవచ్చని, ఆ ఆశ నెరవేరలేదనే నిరాశ కనిపిస్తోందనే చర్చ మొదలైంది. గతంలోనూ బయట వేదికలపైనా, పార్టీ వేదికలపైనా జేసీ దివాకర్‌రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. జగన్ మావాడే కాని..మూర్ఖుడని, చంద్రబాబు గతంలో మాదిరిగా సాఫ్ట్‌గా పాలన సాగించాలంటే కుదరదని, మా చేతులు కట్టేశారని ఇలా..చాలా సార్లు వ్యాఖ్యానించారు. ఇక కడప జిల్లా టూర్‌లో జగన్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. సీఎం జగన్ తన వ్యాపారాలను దెబ్బతీశారని, ట్రావెల్స్‌ని మూసేశారని, వ్యవసాయం చేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనుక.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక..జేసీ కుటుంబంపై నమోదవుతున్న కేసులు, ఆర్థికంగా దెబ్బకొట్టే నిర్ణయాలు కారణం కావచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

మైనింగ్‌కి అడ్డుకట్ట..రూ.100కోట్ల జరిమానా..

ఇక జేసీ కుటుంబానికి అతిపెద్ద ఆర్థిక వనరులు..మైనింగ్, సిమెంటు వ్యాపారాలు, ట్రావెల్స్ మాత్రమే. ఇతరత్రా స్థిరాస్తులు, పెట్రోల్ బంకుల్లాంటి వ్యాపారాలున్నా.. వాటికంటే మైనింగ్, సిమెంట్ కంపెనీ ఆదాయం ఎక్కువగా ఉండేది. జగన్ అధికారంలోకి వచ్చాక.. వారి కుటుంబానికి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ, మైనింగ్‌కు సంబంధించి రూ.వంద కోట్ల జరిమానా విధించడం సంచలనం రేపింది. జరిమానా చెల్లించని పక్షంలో ఆస్తుల జప్తునకు కూడా నోటీసు తీసుకోవాల్సి వచ్చింది. ఇక బీఎస్ 3 వాహనాలను అక్రమంగా బీఎస్ 4గా మార్చారన్న ఆరోపణలపై బస్సులను సీజ్ చేయడం, ఆయన తమ్ముడు ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని  కూడ అరెస్టు చేశారు. ఇక ఇటీవలే ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన అనుచరులు దాడి చేయడంతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గతంలో ఎన్నడూ జరగని రీతిలో.. జేసీ బ్రదర్స్‌కి పెద్ద షాక్ గానే భావించాల్సి ఉంటుంది. ఇక దాడుల కేసులు, పాత కేసులు, ధర్నాల కేసులు చాలా ఉన్నాయి.  ఈ పరిణామాలు ఎలా ఉన్నా.. తప్పొప్పులు ఎవరివి అయినా.. ఇలాగే కొనసాగితే తాడిపత్రి చేజారుతోందనే అభిప్రాయంతో జేసీ బ్రదర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

రాజకీయ వారసత్వం కోసం..

కొన్నాళ్ల క్రితం జేసీ దివాకర్‌రెడ్డి చేసిన ఓ ప్రకటన కూడా జేసీ కుటుంబం అడుగులు ఎటువైపు పడతాయనే అంచనాకు కారణం అవుతోంది. తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని జేసీ దివాకర్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. అంటే పరోక్షంగా రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు తేల్చేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు పవన్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇన్ని అవమానాలు జరుగుతున్నా, ఇన్ని వేధింపులు జరుగుతున్నా.. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబం టీడీపీలో కొనసాగడంపై పవన్‌రెడ్డిలో కొంత అసహనం వ్యక్తం అవుతోందనే అభిప్రాయం కొనసాగుతోంది. అదే సమయంలో వైసీపీకి వెళ్లే ప్రశ్నే లేదని, జగన్ తనకు మిత్రుడైనా..పాలిటిక్స్ వేరు అనే అభిప్రాయంలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి వెళ్తే ఎదురయ్యే పరిస్థితులపై చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఇక రాయలసీమలో బీజేపీకి కీలకనేతలు పెద్దగా లేరు. ఈ నేపథ్యంలో జేసీ రాకతో..సీమలో పట్టు పెంచుకోవచ్చని కూడా బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్‌రెడ్డి వైపు నుంచి పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Tags: Anantapur DistrictAnantapur latest newsAnantapur mlachandra babu naiduchandra babu newschandra babu press meetdoubts is jc going to join in bjpformer tdp mla jc diwakar reddyjc diwakar reddyjc diwakar reddy latest newsnara chandra babu naidutelugu news
Previous Post

‘నంది’ అపహరణ వెనుక నాటకీయ పరిణామాలు

Next Post

మతమార్పిడుల కోసమేనా పాస్టర్లకు జీతాలిస్తోంది: సోము వీర్రాజు

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పోలీసులపై సజ్జల భార్గవ్‌ స్కెచ్‌…?? సీన్‌ రివర్స్‌…!!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

అన్ని పార్టీల వ్యూహమొకటే.. ‘టార్గెట్ కోదండ‌రాం’!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

తెలంగాణ కమలానికి నో పవనిజం!

నానీని అంతలా ఆకట్టుకున్న కామెడీ ఏమిటో?

మైత్రీ బ్యానర్లో చంద్రశేఖర్ యేలేటి కొత్త చిత్రం! 

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist