ఒకప్పుడు బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది జుహీ చావ్లా. బాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించి మంచి క్రేజ్ కొట్టేసింది. హిందీతో పాటు పంజాబీ, మళయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లోనూ నటించింది. సినిమాల్లో నటించడమే కాక, టెలివిజన్ పర్సనాలిటీగానూ, దాతగానూ ఆమె ప్రసిద్ధి చెందింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీంకు సహ యజమానిగా వ్యవహరిస్తోంది. 1995లో పారిశ్రామికవేత్త జయ్ మెహతా ను వివాహం చేసుకుంది ఆమె. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆమె తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల పట్ల పిల్లల ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పుకొచ్చింది.
తన పిల్లలు జాహ్నవి, అర్జున్ తాను నటించిన సినిమాలు చూడడానికి ఇబ్బందిపడతారని చెబుతూ ఓపెన్ అయింది జుహీ చావ్లా. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో తాను చేసిన సినిమాలు చూడటానికి వాళ్లు ఇష్టపడరని, వాటిలో తాను నటించిన రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఆ సినిమాలను చూడరని చెప్పింది ఆమె. తన కెరీర్ ఆరంభంలో కొన్ని రొమాంటిక్ సినిమాలలో నటించడం తప్పలేదని వాపోయింది. హీరోయిన్స్ కెరీర్‌లో గ్లామర్ ట్రీట్ అనేది చాలా ముఖ్యం అని తెలిపింది. ఒకవేళ ఏదైనా నా సినిమా చూడాలనుకున్నా ముందుగానే `అమ్మా ఆ మూవీలో ఏమైనా రొమాంటిక్ సీన్లు ఉంటాయా` అని అడుగుతారని చెప్పింది. అమ్మా నిన్ను రొమాంటిక్ సీన్లలో చూడడం నాకు నచ్చదని కొడుకు అర్జున్ అంటుంటాడని జుహీ చావ్లా తెలపడం విశేషం.











