(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావును శ్రీకాకుళం జిల్లా రాజాంలోని ఆయన స్వగృహంలో బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.
విజయనగరం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని కోదండరాముని శిరస్సును ఖండించిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కిమిడి కళా వెంకట్రావు, కింజరాపు అచ్చెన్నాయుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు తదితరులు రామతీర్థం ఇటీవల సందర్శించారు. అదే తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం వచ్చారు. విజయసాయిరెడ్డి కోదండరాముని సందర్శించి తిరిగొస్తుండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై చెప్పులతో దాడి చేశారు.
దీనికంతటికీ కళా వెంకట్రావు కారణమని భావించిన విజయసాయిరెడ్డి .. అందుకు నారా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ప్రోత్సహించారని నెల్లిమర్ల పోలీసు స్టేషన్లో వీరందరిపై కేసు పెట్టారు. ఆ నేపథ్యంలోనే ఈ అరెస్టు జరిగివుండవచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
Much Read ;- కళా అరెస్టును ఖండిస్తున్నాం : అచ్చెన్న