తమిళ పురుచ్చి తలైవి జయలలిత బయోపిక్ గా ‘తలైవి’ చిత్రర రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్బెంబరు 10న విడుదల కాబోతోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాలి. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడింది. ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉన్నా థియేటర్లలోనే ఈ సినిమాని విడుదల చేయాలని ఆగారు. అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ తర్వాత హిందీ చిత్రాలు వరసగా విడుదలకు సిద్ధమవుతున్నారు.
ఈ కోవలో విడుదలయ్యే రెండో చిత్రం ఇమ్రాన్ హష్మీ నటించిన ‘చెహ్రే’ అయితే మూడో చిత్రం ‘తలైవి’గా చెప్పవచ్చు. ఇందులో జయలలిత పాత్రను కంగనా రనౌత్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్ ను కంగనా కూడా తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ సినిమాకి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ఒకవిధంగా ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే. ఒకే సారి పలు భాషల్లో విడుదల కాబోతోంది. ఇందులో అరవిందస్వామి, మధు, భాగ్యశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కొన్ని పరిమితుల కారణంగా కలెక్షన్ల వసూళ్లలో బెల్ బాటమ్ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది.
ఆ స్థానాన్ని ‘తలైవి’ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. నిర్మాతలు కూడా తలైవి ప్రచారం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. విడుదలకు రెండు వారాల ముందు నుంచే ప్రమోషన్ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. జయలలితకు తమిళనాట ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఆమె మరణానికి సంబంధించి ఇందులో ఎలా చూపించారన్న ఆసక్తి కూడా నెలకొని ఉంది. వివాదాల జోలికి వెళ్లకపోతే సినిమాలో ఆసక్తికర అంశాలు ఉండవు. అసలు జయలలిత జీవితమే వివాదాల మయం. మరి ఇందులో అలాంటి అంశాలను ఎలా చూపించారన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది.
Must Read ;- వెంకీ దృశ్యం 2 విడుదల థియేటర్లలోనేనా?











