లాస్టియర్ ‘పంగా’ సినిమాతో సక్సెస్ తో అందరినీ ఆకట్టుకున్న బాలీవుడ్ ఫైర్ బ్రాడ్ కంగానా రనౌత్ .. ఈ ఏడాది కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే సినిమాల్ని లైనప్ చేసుకుంది. ప్రస్తుతం తమిళ సినిమా తలైవి సినిమాకు కొత్త రిలీజ్ డేట్ రెడీ చేసే హడావిడిలో ఉన్న కంగనా.. వీటి తర్వాత ‘ధాకడ్, తేజస్’ లాంటి సినిమాలను పట్టాలెక్కించే పని కూడా పెట్టుకుంది.
ఇవి ఇలా ఉంటే.. కంగానా రనౌత్ .. నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టబోతోంది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించింది. మణికర్ణిక ఫిల్మ్స్ పేరుతో సొంత బ్యానర్ ను ప్రారంభించబోతున్నట్టు ఆమె ట్విట్టర్ వేదిక గా తెలిపింది. బ్యానర్ లోగోను అభిమానులతో పంచుకోవడమే కాకుండా.. ఈ బ్యానర్ లో నిర్మించబోయే ఫస్ట్ ప్రాజెక్ట్ వివరాలు కూడా తెలిపింది.
మణికర్ణిక ఫిల్మ్స్ బ్యానర్ పై కంగనా రనౌత్ .. ముందుగా సినిమాని కాకుండా ఓ వెబ్ సిరీస్ చేయనుండడం విశేషంగా మారింది. టిక్ వెడ్స్ షెర్ అనే అందమైన ప్రేమ కథను ముందుగా రూపొందించబోతోంది. కొత్త నటీనటులతో ఈ వెబ్ సిరీస్ ను ప్రారంభించబోతోంది. ‘టికు వెడ్స్ షెరు అనే అందమైన ప్రేమకథతో డిటిటల్ రంగంలోకి ప్రవేశిస్తున్నాను. అంతేకాదు మణికర్ణిక ఫిల్మ్స్ టైటిల్ లోగోను కూడా ఈ సందర్భంగా విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు కావాలి.. అంటూ ట్వీట్ చేసింది. మరి కంగనా రనౌత్ ఈ రంగంలో ఏ రేంజ్ లో రాణిస్తుందో చూడాలి.
Must Read ;- కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కంగానా సినిమా వాయిదా !
Launching the logo of @ManikarnikaFP with the announcement of our debut in digital space with a quirky love story Tiku weds Sheru …. Need your blessings 🙏 pic.twitter.com/ulaMK62m7l
— Kangana Ranaut (@KanganaTeam) May 1, 2021










