ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని వాడరేవు, కటారివారిపాలెం గ్రామాల మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతోంది. వాడరేవు మత్సకారులు బల్లవల వాడుతున్నారని కటారివారిపాలెం మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల తమకు చేపలు దొరకడం లేదని వారు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇరు గ్రామాల మత్స్యకారులు రాళ్లు రువ్వుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం, ఎంపీ మోపిదేవి వెంకటరమణ వారి మధ్య రాజీ కోసం చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. తాజాగా అధికారులు ఇరు గ్రామాల మత్స్యకారులను చర్చలకు ఆహ్వానించారు. చర్చలకు వచ్చేది లేదని వారు తేల్చి చెప్పారు. బల్లవలను ప్రభుత్వం కూడా నిషేధించిందని, వాడరేవు మత్స్యకారులు ఆ వల వాడకుండా చూడాలని, అప్పటి వరకు ఎలాంటి చర్చలు జరిపేది లేదని కటారివారిపాలెం మత్స్యకారులు తెగేసి చెప్పారు. దీంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు.
Must Read ;- కరణంకి వెన్నుదన్నుగా జగన్ మామయ్య!











