యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే త్రివిక్రమ్ ఫుల్ స్క్రిప్ట్ ను పక్కాగా రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రలో కనపించనున్నాడని, అందులో ఒకటి విదేశాల్లో బిజినెస్ మెన్ కాగా, రెండో పాత్రలో ఒక రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడని టాక్. పక్కా కమర్షియల్ బిజినెస్ మేన్ అయిన ఎన్టీఆర్ అనుకోకుండా ఇండియా వస్తాడని, అయితే ఇండియాలో బిజినెస్ కన్నా రాజకీయాల్లోనే బాగా సంపాదించుకోవచ్చు అనే ఆలోచన వస్తుందని, అప్పటి నుండి హీరో ఏం చేస్తాడనేదే కథ అని సమాచారం.
అయితే ఎన్టీఆర్ ఇదంతా చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంటుందని, తను చేసే ప్రతీ చెడ్డ పనికి ఒక మంచి జరుగుతుందని, ఆ విషయం సినిమా చివరిలో ఒక ట్విస్ట్ గా ప్రేక్షకులకు తెలుస్తుందని సమాచారం. ఇదేగనుక స్టోరీ అయితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనపడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు ఈ కథ గురించి అనేక విధాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.