కోర్టును ఆశ్రయించిన వివేకా పీఏ కృష్ణారెడ్డి …!
వివేకా హత్య కేసు మిస్టరీగానే మిగిలిపోయేలా ఉంది. ఈ కేసు విచారణలో అత్యన్నత స్థాయి దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ సైతం తన పరువు తానే తీసుకుంటుంది అన్నది వాస్తవం! కేసులో ఆఫ్ ది రికార్డెడ్ గా ఉన్న ప్రధాన నిందుతులు కళ్లముందు ఉన్నా.. వారిని సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేయలేని పరిస్థితి! సాక్ష్యులుగా ఉన్నవారు కూడా సీబీఐకి సహకరించకుండా కోర్టును, ఎస్పీలను ఆశ్రయించి .. కేసు నుంచి దూరంగా జరుగుతున్నారు. సీబీఐకు సహకరించడంలేదు. ఇప్పటికే కీలక నిందులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరిలను సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా మంగళవారం వివేక పీఏ కృష్ణారెడ్డి .. సీబీఐపై సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో వేరే వారి పేర్లు చెప్పాలని తనపై సీబీఐ ఒత్తిడి తీసుకొస్తోందని ఆరోపిస్తూ.. జిల్లా ఎస్పీకి, పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక పులివెందుల కోర్టును కూడా ఆయన ఆశ్రయించారు. కదరికి చెందిన అడ్వకేట్ లోకేశ్వర్ రెడ్డి ద్వారా సీబీఐ ఏఎస్పీ అధికారి రామ్ సింగ్ పై ఫిర్యాదు చేశారు. అంతేకాక వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సునీత కూడా సీబీఐకి అనుకూలంగా చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని పిటిషన్ ద్వారా కోర్టుకు వివరించారు.
నార్కో పరిక్షలను నిరాకరించిన పులివెందుల కోర్టు..!
వివేకా హత్యకు సూత్రదారి, పాత్రదారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు చేయాలని సీబీఐ భావించింది! అలా చేస్తే.. తప్పనిసరిగా వివేకా హత్యకు గల ప్రధాన కారణాలు, హత్యలో పాత్రదారులందరూ బయటకొస్తారన్నది సీబీఐ వాదన. దీనిపై పులివెందుల కోర్టులో శివశంకర్ రెడ్డికి నార్కో పరీక్షలు చేయించాని పిటిషన్ కూడా దాఖలు చేసింది. కానీ కోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. హత్య కేసులో నిందుతుల రిమాండ్ ను మరోసారి పొడిగించింది. జనవరి 11 వరకు రిమాండ్ ను పొడిగించారు. అయితే నార్కో పరిక్షలు నిర్వహిస్తే.. కేసులో కీలక నిందుతుల చిట్టా మొత్తం బయటకొస్తోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి ప్రమేయం ఉన్నట్లు అప్రూవర్ గా మారిన వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఎప్పుడో వెల్లడించారు. ఈ కేసులో ఎంపీ అవినాష్, ఆయన తండ్రిని విచారిస్తేనే అసలు విషయాలు బయటకొచ్చే ఛాన్స్ ఉంటుందని సీబీఐ భావిస్తోంది! ఈ క్రమంలోనే హత్య కేసులో దర్యాప్తు చివరి దశకు చేరుకుంది అన్న తరుణంలోనే ట్విస్ట్‌ల మీదా ట్విస్ట్‌లు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తూ.. సీబీఐ కు చుక్కలు చూపుతున్నాయి.
Must Read ;- గుండెల్లో గొడ్డలి .. సూత్రదారులెవరు?











