సుండుపల్లి వైసీపీ నేతల మధ్య విబేధాలకు కారణాలు..!
కడప జిల్లా, రాయచోటి నియోజకవర్గం పరిధిలోని సుండుపల్లి మండలంలో అధికార పార్టీ వర్గ విబేధాలు తారాస్థాయికి చెరుకున్నాయి. సుండుపల్లిలో జరిగిన ఆసరా సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి లు హాజరయ్యారు. ఆసరా కార్యక్రమం అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జరగనున్న సర్వసభ్య సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే, చైర్మన్లు హాజరయ్యారు. ఇదే వేదికగా ఎప్పటి నుంచో సుండుపల్లి మండల ఇంఛార్జి బాధ్యతల తలెత్తిన వివాదం మరోసారి బయటపడింది. ఇంఛార్జీ ఎవరన్నది తెల్చాలని నాయకులు పట్టుపడ్డారు. దీంతో నేతల మధ్య ఎప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న మనస్పర్థలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఒకరినోకరు బాహాబాహీకి దిగారు.
ఎంపీ మిథున్ రెడ్డిని పక్కననెట్టి పరపరస్పర మరి దాడులు..!
కడప జిల్లాలో సుండుపల్లిలో మండల పరిషత్ కార్యాలయంలో అధికార వైసీపీ లో చెలరేగిన వివాదం .. దాదాపు 20 నిమిషాల పాటు చిన్నపాటి యుద్దం తలపించింది. ఈ ఘర్షణలో పరస్పరం దాడులు చేసుకుంటూ గాయపర్చుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి లు ఆపే ప్రయత్నం చేసినా.. ఫలితం లేదు. ఎంపీ మిథున్ రెడ్డిని, ఆయన వ్యక్తిగత అధికార సిబ్బందిని పక్కకునెట్టి మరి కొట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్యల జరిగిన బాహాబాహీలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. రాయచోటి గ్రామీణ సీఐ లింగప్ప ఆధ్వర్యంలో పోలీసులు ఇరు వర్గాలను చెదగొట్టారు. పరిస్థితి అదుపులోకి తెచ్చిన తరువాత మండల సర్వసభ్య సమావేశం యథావిధిగా జరిగింది.
Must Read ;- నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తలు హల్చల్..! నడిరోడ్డుపై కర్రలతో దాడి..!!










