కరోనా కేసులు కాస్తా తగ్గుతుండటంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు మరిన్ని సడలింపులు ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే, సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. సాయంత్రం 6 గంటల తర్వాత కర్ఫ్యూను పక్కగా అమలు చేయాలని సూచించింది. తూర్పు గోదావరిలో జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకే మాత్రమే సడలింపులు ఇచ్చింది. తాజా నిబంధనలు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.
Must Read ;- దేశంలో 60 వేలకు తగ్గిన కరోనా కేసులు











