విధుల నిర్వహణలో గ్రామవాలంటీర్లు విఫలమవుతున్నారనే ఆరోపణలు తరుచుగా వినిపిస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం వారిపై చర్యలకు దిగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 33 మంది గ్రామవాలంటీర్లపై వేటు పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ గ్రామవాలంటీర్లు ఫీవర్ సర్వే చేస్తున్నారు. జ్వరం లేనివాళ్లకు కూడా జ్వరం ఉన్నట్టు ఆన్ లైన్ పేర్లు నమోదు చేశారనే ఆరోపణలు వచ్చాయి. సర్వే పై నిర్లక్ష్యం వహించిన వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఏకంగా 33 మంది గ్రామవాలంటీర్లపై వేటు పడటంతో ఏపీ అంతటా చర్చనీయాంశమైంది.
Must Read ;- లోకేష్‌కు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.. కోవిడ్ నుంచి బయటపడిన గొడవర్రు గ్రామస్థుల ప్రశంసలు