దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో.. రాష్ట్రాలు అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. తెలంగాణలో సర్కార్ కూడా అన్ లాక్ వైపు అడుగులు వేయనుంది. కరోనా కేసులు తగ్గుతుండటం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుంజుకునేందుకు మరిన్ని సడలింపులు ఇచ్చే యోచనలో ఉంది. ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. ఈనెల 19న లాక్ డౌన్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో, ఈ నెల 20 తర్వాత నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించేందుకు మొగ్గు చూపుతోంది. జిమ్స్, పబ్బులు, బార్లకు కూడా అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ అయి, అన్ లాక్ పై చర్చించి స్పష్టత ఇవ్వనుంది.
Must Read ;- తగ్గనున్న కరోనా మందుల ధరలు.. 44 జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం










