(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు శనివారం విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి అదితి గజపతి రాజు కేక్ కట్ చేసి అభిమానులు, కార్యకర్తలకు పంచిపెట్టారు.
విద్యార్థుల దత్తత
ఈ సందర్బంగా విజయనగరం పేర్ల వారి వీధిలోని డెఫ్ అండ్ డంబ్ పాఠశాలలోని ఆరుగురు విద్యార్థులను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందికి ఒక్కో విద్యార్థికి రూ. 6,000/- చొప్పున పూసపాటి అశోక్ గజపతి రాజు, అదితి గజపతి రాజు, బొద్దుల నర్సింగరావు, కంది మురళీనాయుడు, గంటా పోలినాయుడు, గుల్లిపల్లి రాజు అందించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి. రాజు, రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి విజ్జపు వెంకట ప్రసాద్, జిల్లా యువత అధ్యక్షులు కర్రోతు వెంకట నర్సింగరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్, మాజీ జడ్పీటీసీ తుంపిల్లి రమణ, పార్టీ నాయకులు పూనమ్ చంద్ చౌదరి, కెంగువ శ్రీనివాస్, మైలపల్లి పైడిరాజు, చెన్నా రూపవాణి, వడ్లమాని సుభద్ర, కంట ఎర్రయ్య, యువత నాయకులు గొలగాన సురేంద్ర, పోలినేటి మహేష్, షేక్ బాషా, చిగురుపాటి కుటుంబరావు, పాలూరి రాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- నీ మదాన్ని అణిచేస్తాం జగన్ రెడ్డీ : లోకేష్