ఎన్నో సూపర్ హిట్ పాటలతో శ్రోతల్ని ఉర్రూతలూగించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు రామ్‌లక్ష్మణ్ (78) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం గుండె పోటు వచ్చింది. ఆయన నాగ్ పూర్ లో ఉంటున్నారు. ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్ హై’, ‘100 డేస్’ లాంటి ఎన్నో చిత్రాలకు ఆయన సంగీతం సమకూర్చారు.
‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’ సినిమాల పాటలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. అసలు పేరు విజయ్ పాటిల్ అయినా రామ్ లక్ష్మణ్ పేరుతోనే ప్రసిద్ధి. ఆయన ఇంట్లోనే మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణించారని తెలిసి బాలీవు్ దిగ్బ్రాంతి చెందింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తన సంతాప సందేశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
‘బహుముఖ ప్రజ్ఞావంతుడు, ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రామ్‌లక్ష్మణ్ మరణించారని తెలిసింది. ఆయన మరణవార్త నాకెంతో బాధను కలిగించింది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన సంగీత సారథ్యంలో నేను మంచి పాటలు పాడాను. ఓం శాంతి’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ ప్రముఖులు చాలామంది రామ్ లక్ష్మణ్ మృతికి సంతాపం ప్రకటించారు.
Must Read- చిప్కో ఉద్యమకారుడు ఇకలేరు : ఆయన జీవితం పర్యావరణానికి అంకితం;











