యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. స్కూటీపై వెళుతున్నవారిని కారు ఢీ కొట్టడంతో యువతి, యువకుడు మరణించారు. యువతి అక్కడిక్కడే మరణించింది. యువకుడికి తీవ్ర గాయాలవడంతో అతడిని దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆ యువకుడు కూడా మృతి చెందారు. ప్రేమ వివాహం చేసుకునేందుకు ఆ జంట కొండగట్టకు వెళ్తున్నట్లు స్థానికంగా కొందరు చెప్తున్నారు. ఈ జంట రంగారెడ్డి జిల్లా మన్నెగూడ వాసులుగా పోలీసులు గుర్తించారు. కారు యజమానిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
క్షతగాత్రుల్లో బాబాయి, పిన్ని కూడా..
చౌటుప్పల్ లో కారు బీభత్సం సృష్టించిన ఘటన అక్కడ స్థానికంగా ఉండే వారిని భయబ్రాంతులను గురిచేసంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న కారు ఒక్కసారిగా జాతీయ రహదారిపై బ్రేకులు ఫెయిల్ అయి అదుపుతప్పింది. అదుపుతప్పిన కారు స్కూటీతో పాటు మరికొన్ని వాహనాలను ఢీ కొట్టింది. దీంతో స్కూటీపై ఉన్న ప్రేమ జంట మరణించింది. అలాగే స్కూటీ వాహనం వెనుకాల మరో వాహనంలో వస్తున్న యువకుని బాబాయి, పిన్ని కి కూడా గాయాలైనట్లు తెలిసింది. చికిత్స నిమిత్తం వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొనడం వల్ల స్కూటీ వాహనం నుంచి పెట్రోల్ లీకై ఆ వాహనం తగలడిపోయింది.











