పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. 27వ సినిమాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ అండ్ హిస్టారికల్ ఫిక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దంలో మొఘలాయీల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన బందిపోటు దొంగ వీరమల్లు. ఆ కాలంలోని పేదప్రజలకు అండగా నిలబడే ఓ ధీరోదాత్తుడిగా పవన్ నటించబోతున్నారు. అలాగే.. ఈ సినిమా కథకి, కోహినూర్ వజ్రానికి కూడా లింక్ ఉంటుందట. సినిమాలో అదే హైలైట్ పాయింట్ అని తెలుస్తోంది.
ఇక ‘హరిహర వీరమల్లు’ మూవీలో పవర్ స్టార్ 3 గెటప్పుల్లో కనిపిస్తారట. అలాగే.. 30 కాస్ట్యూమ్స్ లో అభిమానుల్ని అలరిస్తాడట. ఈ సినిమా కాస్ట్యూమ్స్ డిజైనర్ ఐశ్యర్యా రాజీవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో పవర్ స్టార్ కోసం మొత్తం 30 కాస్ట్యూమ్స్ డిజైన్ చేశామని, ఆయన ఇప్పటి వరకూ చేయని పాత్రను ఇందులో చేస్తున్నారు కాబట్టి.. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. వీరమల్లు పాత్ర తీరుతెన్నులు, బిహేవియర్ ను బట్టి.. ఆ కాస్ట్యూమ్స్ ఎంపిక జరిగినట్టు చెప్పింది. స్ర్కిప్ట్ , కేరక్టర్ ఆధారంగానే ఆయన దుస్తుల్ని డిజైన్ చేసినట్టు ఆమె తెలిపింది. వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు పవర్ స్టార్ కు ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- వచ్చే సంక్రాంతికి మహేశ్ – పవన్ వార్